‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రీ రిలీజ్ బిజినెస్..!

విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజా బెల్లా.. వంటి వారు హీరోయిన్లుగా నటించారు . ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ పై కె.ఎస్.రామారావు, కె.ఏ. వల్లభ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్ కు అంత మంచి రెస్పాన్స్ రాలేదు కానీ ట్రైలర్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు కూడా పర్వాలేదు అనిపించడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి.

ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 9 cr
సీడెడ్ 4 cr
ఆంధ్ర 10 cr
ఏపీ + తెలంగాణ 23 cr
 రెస్ట్ ఆఫ్ ఇండియా 4 cr
ఓవర్సీస్ 3.5 cr
వరల్డ్ వైడ్ టోటల్ 30.50 cr

‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రానికి 30.5 కోట్ల బిజినెస్ జరిగింది. ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ప్లాప్ అయినప్పటికీ ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరిగిందనే చెప్పాలి. ఏమాత్రం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రావడం ఖాయం. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ‘జాను’ చిత్రం కూడా ఇప్పుడు పెద్దగా కలెక్షన్లను రాబట్టడం లేదు.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కు అదో అడ్వాంటేజ్ అని చెప్పాలి.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus