‘నరసింహనాయుడు’ టైంలో అంత జరిగిందా.. చిన్నికృష్ణ షాకింగ్ కామెంట్స్!

ఇప్పుడు బుర్రా సాయి మాధవ్ (Sai Madhav Burra) మాదిరి ఒకప్పుడు స్టార్ రైటర్ అంటే ఎక్కువగా చిన్నికృష్ణ (Chinni Krishna) పేరు చెప్పేవారు. ‘నరసింహనాయుడు’ (Narasimha Naidu) ‘ఇంద్ర’ (Indra) ‘గంగోత్రి’ (Gangotri) వంటి హిట్టు సినిమాలకు ఆయన పనిచేశారు. చిరంజీవికి ఆయన వీరాభిమాని. తర్వాత కొన్నాళ్ల పాటు మెగా ఫ్యామిలీకి ఆస్థాన రైటర్ అనిపించుకున్నారు. మెగా ఫ్యామిలీ పై విమర్శల వర్షం కురిపించే వాళ్ళపై ఈయన నిప్పుల వర్షం కురిపించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ 2019 ఎన్నికల టైంలో మెగా ఫ్యామిలీపై ఈయన నోటికొచ్చిన మాటలు మాట్లాడి అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యారు.

Chinni Krishna:

తర్వాత ఈయనకి అవకాశాలు కూడా లేవు. మొన్నామధ్య మళ్ళీ మెగా అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియో చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ సందర్భంలో ఈయన బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా హిట్ అయితే చిరంజీవి (Chiranjeevi) ఫ్యాన్స్ ఏడ్చేశారు అంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో చిన్నికృష్ణ (Chinni Krishna) మాట్లాడుతూ “నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటే.. ‘నరసింహనాయుడు’ సినిమా రిలీజ్ అయినప్పుడు జరిగింది. ‘నరసింహనాయుడు’ సినిమా రిలీజ్ రోజు ‘మృగరాజు’..

అలాగే ఒక రోజుకి అటు ఇటులో ‘దేవీపుత్రుడు’ (Devi Putrudu) కూడా రిలీజ్ అయ్యింది. ‘నరసింహనాయుడు’ సూపర్ హిట్ అయ్యింది. ఆల్ టైం హిట్ అన్నారు. ఓపెనింగ్స్ లో కూడా రికార్డులు సృష్టించింది. అయితే అందుకు నా మిత్రులు, మా ఊర్లో నాతో పాటు పుట్టి పెరిగిన బంధువులు, చిరంజీవి గారి అభిమానులు .. తట్టుకోలేక తాగేసి నా దగ్గర ఏడ్చేశారు.నాకు హిట్టు వచ్చినప్పటికీ.. అది నన్ను చాలా బాధించింది.

‘మృగరాజు’ (Mrugaraju) కొంచెం అటు ఇటు అయ్యింది అని వాళ్ళ బాధ. ఎంతైనా వాళ్ళు నా మిత్రులు, బంధువులు కదా..! కాబట్టి అది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన” అంటూ చెప్పుకొచ్చారు. 2001 సంక్రాంతికి చిరంజీవి ‘మృగరాజు’, బాలకృష్ణ ‘నరసింహనాయుడు’ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. వీటిలో ‘నరసింహనాయుడు’ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కానీ ‘మృగరాజు’ డిజాస్టర్ అయ్యింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus