Vijayendra Prasad: విజయేంద్రప్రసాద్ మాటలు.. వివాదంలోకి నెట్టేశాయి!

  • July 11, 2022 / 10:49 AM IST

టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. తెలుగుతో పాటు హిందీ సినిమాలకు కూడా పని చేశారాయన. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ రీసెంట్ గా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో విజయేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకప్పటి ప్రధాని నెహ్రూ ఎలా ఎంపికయ్యారనే విషయానికి సంబంధించి విజయేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు విజయేంద్రప్రసాద్ ను కొందరు తప్పుబడుతున్నారు. ఇంతకీ ఆయనేం మాట్లాడారంటే.. ”బ్రిటీష్ వారు దేశం విడిచి వెళ్లిపోయే సమయంలో పీసీసీ హెడ్ అయిన గాంధీని పిలిచి మీరు ఓ నాయకుడిని ఎన్నుకోండి. అతనికి బాధ్యతలను అప్పగించి వెళ్లిపోతామన్నారు. అప్పుడు 17 మంది పీసీసీ పెద్దలున్నారు. గాంధీ అందరినీ పిలిచారు. ప్రధాని కావాలంటే కేవలం ఖద్దరు వేసుకుంటేనే సరిపోదు. చక్కగా చదువు ఉండాలి. దేశ విదేశాలకు వెళ్లినప్పుడు మాట్లాడగలగాలి. నా ఛాయిస్ అయితే నెహ్రూ మీరు ఎవరిని ఎన్నుకుంటారో ఎన్నుకోండి అని అన్నారు.

ఎవ‌రిని ప్ర‌ధానిగా ఎన్నుకోవాలో వారి పేరుని పేపర్ లో రాసివ్వమని అడిగారు.17 మంది పీసీసీ అధ్యక్షుల్లో 15 మంది స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ప్ర‌ధాని కావాల‌ని ఎన్నుకున్నారు. నిజంగా గాంధీకి ప్ర‌జాస్వామ్యంపై ఏమాత్రం గౌర‌వం ఉన్నా.. ఆయ‌న ప‌టేల్‌గారిని ప్ర‌ధానిగా ఎన్నుకోవాలి. కానీ నెహ్రూని ప్ర‌ధాని చేయాల‌ని ఢిల్లీలో మీటింగ్ పెట్టి నెహ్రూని ప్ర‌ధానిగా నామినేట్ చేశారు. అంతే కాకుండా నెహ్రూ ప్ర‌ధాని కావాల‌ని చెబుతూ పటేల్‌ను పేరు నామినేట్ చేయాల‌ని అడిగారు.

అంతే కాకుండా తాను బ‌తికినంత కాలం ప్ర‌ధాని కాకూడ‌దంటూ స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ద‌గ్గ‌ర మాట తీసుకున్నారు. ప‌టేల్‌గారు ప్ర‌ధానిగా ఉండుంటే కాశ్మీర్ రావ‌ణ కాష్టంలా ఉండేది కాదు. ఇప్ప‌టికీ ఆ రావ‌ణ కాష్టం మండుతూనే ఉంది” అంటూ విజయేంద్రప్రసాద్ అన్నారు. ఆయన రాజ్యసభకు నామినేట్ అయిన తరువాత ఈ పాత వీడియోను బయటకు తీసి వైరల్ చేస్తున్నారు కొందరు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus