ఈ ఏడాది ఆస్కార్ బరిలో మన దేశం నుండి సినిమాలేవీ బరిలో లేవు. ఆశలు రేపిన సూర్య ‘జై భీమ్’, మోహన్‌లాల్ సినిమా ‘మరక్కర్’ నామినేషన్స్ జాబితాలోకి రాలేకపోయాయి. అయితే ఆస్కార్ బరిలో భారతీయ సినిమా ఇంకొకటి ఉంది. అయితే అది డాక్యుమెంటరీ చిత్రం. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఆ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటా చిత్రం, దాని నేపథ్యమేంటి, కథేంటి అనేది ఓసారి చూద్దాం. మార్చి 27న జరగనున్న 94వ ఆస్కార్ పురస్కారాల నామినేషన్ల జాబితాను ఇటీవల వెలువరించారు.
అందులో ‘జై భీమ్’, ‘మరక్కర్’ పేర్లు లేకపోవడంతో భారతీయ సినీ అభిమానులు నిరాశకు గురయ్యారు. కానీ ఉత్తమ డాక్యుమెంటరీ కేటగిరిలో ‘రైటింగ్ విత్ ఫైర్’ అనే చిత్రం నామినేట్ అయ్యిందని తెలిసి కాస్త ఆనందించారు. అభిమానులకు కాస్త ఊరటనిచ్చిన ఆ చిత్ర కథాంశం ఆసక్తికరంగా ఉంటుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ‘కబర్ లెహరియాని’ అనే పత్రికకు పనిచేసే మహిళా రిపోర్టర్ల జీవితాన్ని ఆవిష్కరించిన చిత్రమిది. కొంతమంది దళిత మహిళలు ఏళ్లుగా ఓ పత్రికను ఎలా నడిపిస్తున్నారు అనేది ‘రైటింగ్ విత్ ఫైర్’ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు.
ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉండే లింగవివక్ష సంఘటనల ఆధారంగా ఆ పత్రికలో వార్తలు రాస్తుంటారు. ఈ నేపథ్యంలో కులవివక్షను తట్టుకుని వార్తల్ని ఎలా సేకరిస్తుంటారు? ప్రచురించి పాఠకులకు ఎలా అందిస్తుంటారు? అనే అంశాలను ఈ సినిమాలో చూపించారు. అత్యాచార, గృహహింస బాధితుల నుండి విస్తుపోయే విషయాల్ని సేకరించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుస్మిత్ ఘోష్, రింటూ థామస్ స్వీయ నిర్మాణంలో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను తెరకెక్కించారు. ఎడిటర్ బాధ్యతలను పోషించారు.
చిత్రానికి సుస్మిత్ ఘోష్, కరణ్ థాప్లియాల్ ఛాయాగ్రహణం అందించారు. తజ్డార్ జునైద్, ఇషాన్ ఛబ్ర సంగీతమందించారు. 2021 జనవరి 30న ఈ డాక్యమెంటరీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!