తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో నటించి నటిగా యమున తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మౌన పోరాటం సినిమా నటిగా యమునకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో సీరియళ్లలో నటిస్తూ బిజీగా ఉన్న యమున తాజాగా ఒక టాక్ షోలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను మనసులో ఏదీ పెట్టుకోనని ముక్కుసూటిగా మాట్లాడతానని అందుకే ఫైర్ బ్రాండ్ అనే పేరు వచ్చిందని ఆమె పేర్కొన్నారు.
మా ఆయన బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తారని పెద్దమ్మాయి ఎంబీఏ, చిన్నమ్మాయి ఇంటర్ చదువుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వయస్సులో టీవీ సీరియళ్లు అనుకూలంగా ఉండటంతో టీవీ సీరియళ్లలో నటిస్తున్నానని ఆమె వెల్లడించారు. తనకు యూట్యూబ్ ఛానల్ ఉందని ఆ ఛానల్ ద్వారా సరదా కార్యక్రమాలను ఇవ్వడంతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. బాలచందర్ ఫోర్స్ వల్లే తాను సినిమాలలో నటించానని యమున అన్నారు.
మౌనపోరాటం చూస్తే నేనేనా అని అనిపిస్తోందని ఆమె కామెంట్లు చేశారు. దాసరి గారి దగ్గర స్పాంటేనిటీ నేర్చుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. పదో తరగతి తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చానని ఆమె అన్నారు. తాను 70 సినిమాలు చేశానని తెలుగు, కన్నడ సినిమాలలో తాను ఎక్కువగా నటించానని యమున కామెంట్లు చేశారు. బాలకృష్ణ సినిమాలో తనకు ఛాన్స్ వచ్చిన సమయంలో జడ్జిమెంటు అనే సినిమా చేస్తున్నానని అలా బాలయ్య మూవీ మిస్సైందని యమున అన్నారు.
కొదమసింహం సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినా ఆ మూవీ కూడా అలానే మిస్సైందని యమున వెల్లడించారు. శ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవితో కలిసి చిన్న బిట్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు. ట్యాక్సీవాలా సినిమా తెలుగులో చివరిగా నటించిన సినిమా అని యమున కామెంట్లు చేశారు. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చినా తనకు నటించడం కుదరలేదని ఆమె అన్నారు. అల్లుడుగారు సినిమా సమయంలో తనకు బ్రెయిన్ సరిగ్గా పని చేయలేదని ఆ మూవీ రమ్యకృష్ణను స్టార్ హీరోయిన్ ను చేసిందని యమున తెలిపారు.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?