Ramayana: వావ్‌… నటించమని పిలిస్తే… నిర్మాత అయిపోయాడుగా!

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లయినా ‘కేజీయఫ్‌’ (KGF) సినిమాలతో పాన్‌ ఇండియా స్టార్ అయిపోయాడు యశ్‌. ఆ సినిమాలో యశ్‌ (Yash) కనిపించిన విధానం, అతనిని దర్శకుడు ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) చూపించిన విధానం అంతలా ఉన్నాయి మరి. అయితే ఆ సినిమాల తర్వాత యశ్ చాలా నెలలు కొత్త సినిమా ఏదీ ఓకే చేయలేదు. ఇంకా ఎప్పుడు? అంటూ ఫ్యాన్స్‌ అడగ్గా అడగ్గా ‘టాక్సిక్‌’ (Toxic) అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఆయన చెప్పకపోయినా ‘రామాయణ్‌’ అనే పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి.

ఈ సినిమా షూటింగ్‌ కూడా మొదలైపోయింది అని వార్తలొస్తున్న ఈ సమయంలో సినిమా గురించి ఆసక్తికర విషయం ఒకటి తెలిసింది. అదే ఆ సినిమాకు యశ్‌ ఓ నిర్మాతగా మారాడట. నమిత్‌ మల్హోత్రాతో కలసి మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌, ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఈ సినిమాను నిర్మిస్తారట. నితీశ్‌ తివారీ  (Nitesh Tiwari) దర్శకత్వంలో రూపొందనున్న ‘రామాయణ’ ప్రాజెక్టు గురించి శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అప్పుడు ‘రామాయణ’కి రావణుడు నిర్మాత అని తెలిసింది.

భారతీయ సినిమాని ప్రపంచ వేదిక మీద ఉంచాలన్నది నాకు ఎప్పటి నుండో ఉన్న కల. రామాయణం నేను చేస్తే బాగుంటుందని చాలా సార్లు అనుకున్నాను. కానీ ఆ సబ్జెక్ట్‌ తీయాలంటే మామూలు విషయం కాదు. బడ్జెట్ కూడా అంత ఈజీ కాదు. నేను నమిత్‌ కలసి ఈ సినిమాను నిర్మించాలనుకున్నాం. రామాయణం గురించి ఎంతైనా కష్టపడతాను. ఈ సినిమాకు నితీశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తారు అని యశ్ చెప్పాడు.

భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తుంగగా, సీతగా సాయిపల్లవి నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో రావణుడిగా యశ్‌ నటిస్తాడని టాక్‌. నిర్మాణం విషయంలో చెప్పారు కానీ.. నటిస్తున్న విషయం చెప్పారు. అయితే యశ్‌ మాత్రమే కాదని, ఇంకొందరు దక్షిణాది నటులు ఈ సినిమాలో భాగం అవుతారని సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags