Yash: యశ్ పాత మూవీని రిలీజ్ చేస్తే ప్రేక్షకులు చూస్తారా?

కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులలో చాలామంది యశ్ కు వీరాభిమానులుగా మారారు. యశ్ భవిష్యత్తు ప్రాజెక్టులు సైతం మంచి కంటెంట్ తో తెరకెక్కితే తెలుగులో భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కేజీఎఫ్2 అంచనాలకు మించి విజయాన్ని అందుకోవడం వల్లే యశ్ కు ఈ స్థాయిలో క్రేజ్ పెరిగిందని కామెంట్లు వ్యక్తమయ్యాయి. తెలుగులో కేజీఎఫ్2 అంచనాలకు మించి కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే యశ్ క్రేజ్ ను వాడుకోవాలని కొంతమంది మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. కేజీఎఫ్ ఛాప్టర్1 విడుదలకు ముందే యశ్ కు శాండిల్ వుడ్ లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. యశ్, రాధికా పండిట్ జంటగా ఏడేళ్ల క్రితం కన్నడలో సంతు స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌ అనే సినిమాలో నటించడం జరిగింది. కన్నడలో సక్సెస్ సాధించిన ఈ సినిమాను తెలుగులో రారాజు పేరుతో ఇప్పుడు విడుదల చేస్తున్నారు. యశ్ పాత సినిమాలను ఈ విధంగా విడుదల చేయడం వల్ల యశ్ క్రేజ్ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

యశ్ సినిమాల నిర్మాతలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. మగధీర, బాహుబలి సినిమాలు సక్సెస్ సాధించిన సమయంలో ఇతర భాషల్లో చరణ్, ప్రభాస్ నటించిన సినిమాలు సైతం ఇదే విధంగా ఇతర భాషల్లో విడుదలయ్యాయి. పద్మావతి పిక్చర్స్ సంస్థ తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయనుంది.

ఏడేళ్ల క్రితం రిలీజైన సినిమాను ఇప్పుడు విడుదల చేయడం ఏ మాత్రం సరైన నిర్ణయం కాదని చెప్పవచ్చు. ఈ కామెంట్ల గురించి యశ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. పాత సినిమాలు తెలుగులో ఈ విధంగా విడుదలైతే యశ్ మార్కెట్ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus