ఎన్నికల పై ప్రభావం పడకుండా…!

  • February 15, 2019 / 06:35 PM IST

‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి.వి.రాఘవ డైరెక్షన్లో వచ్చిన ‘వై.ఎస్.ఆర్ బయోపిక్’ యాత్ర ఇటీవల విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో ఆకట్టుకున్నారు. వై.ఎస్.ఆర్ మళ్ళీ తిరిగొచ్చినట్టుందని ఈ చిత్రం చూసిన వై.ఎస్.అభిమానులు ఆనందం వ్యక్తం చేసారు. స్వయంగా వై.ఎస్.జగన్ ఈ చిత్రం పై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం విశేషం.

ఇదిలా ఉండగా… ‘యాత్ర’ చిత్రంలో మనం ఒకటి గమనిస్తే… ఈ చిత్రంలో ఎక్కడా మనకు కాంగ్రెస్ పార్టీ జెండా పై హస్తం గుర్తు కనిపించదు. ఆ గుర్తుకు బదులుగా పిడికిలి గుర్తు కనిపిస్తుంది. అలాగే ఇటీవల విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర ట్రైలర్‌లోకూడా టీడీపీ గుర్తు అయిన సైకిల్‌ను చూపించలేదు. సైకిల్‌కి బదులుగా రిక్షా ను చూపించారు. దీనికి అసలు కారణం ఆంధ్రప్రదేశ్ లో .. ఎన్నికలు దగ్గరకి వస్తుండడంతో .. ఈ చిత్రాలలో ఆయా పార్టీ ఎన్నికల గుర్తులు కనిపిస్తే ఆ పార్టీలకు ప్లస్ అయ్యే అవకాశం ఉండటమేనని స్పష్టమవుతుంది. సినిమాల మాటెలా ఉన్నా.. గుర్తులు ఎక్కువగా ప్రజల మనసులో ముద్ర పడితే అది ఆ గుర్తు తాలుకు పార్టీకి లేనిపోని ప్రచారం కల్పించి..ఎన్నికల్లో గెలుపొందే అవకాశాన్ని కల్పించడమేనని ఆయా గుర్తులకు బదులుగా కాస్త దగ్గరగా ఉండే వేరే గుర్తులను.. ఆ చిత్రబృందాలు చుపించాయట. ఈ చిత్రాలతో పాటు బాలయ్య – క్రిష్ ల ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ చిత్రానికి సంబంధించి కూడా ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus