Waltair Veerayya: చిరంజీవి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్న… విజయ్ సాయి రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ట్రైలర్ చూస్తుంటే సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా భారీగా నిర్వహిస్తున్నారు. ఇక విశాఖపట్నంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తాను ఇప్పటికే వైజాగ్ లో ఇంటి నిర్మాణానికి స్థలం కొనుగోలు చేశానని ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత తాను కూడా వైజాగ్ షిఫ్ట్ అవ్వబోతున్నాననీ తెలియచేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి తాను వైజాగ్ షిఫ్ట్ అవుతున్నానని తెలియజేయడంతో ఈ వ్యాఖ్యలపై వైయస్సార్సీపి ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఈ విషయం గురించి మాట్లాడుతూ

ఆంధ్ర రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయినా విశాఖపట్నంలో మెగాస్టార్ చిరంజీవి స్థిరపడాలనుకోవడాన్ని నేను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను. ఇక చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి సక్సెస్ సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విజయ సాయి రెడ్డి ట్వీట్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సినీ పరిశ్రమ వైజాగ్ రావాలని ఆ మధ్యకాలంలో సీఎం జగన్ కూడా హీరోలతో ప్రస్తావించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి వైజాగ్ లో స్థిరపడతానని తెలియజేయడంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus