వేణు యెల్దండి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా మంచి పేరు సంపాదించుకున్న వేణు. సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో అడపా దడపా సిల్వర్ స్క్రీన్ పై కనపడుతూ వుండేవాడు. అయితే కొంత కాలం గ్యాప్ తీసుకుని మెగా ఫోన్ చేతపట్టి ‘బలగం’ అనే సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు వేణు. అది ఊహించ దానికంటే ఎక్కువగా సక్సెస్ అవ్వటం జరిగింది. ఆ మూవీ తరువాత వేణు దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ తో ఒక మూవీ రాబోతుందని వార్తలు వినిపిస్తూనే వున్నాయి. అయితే ఆ మూవీ కి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న (జనవరి 14న) రిలీజ్ చేయగా, ఈ రోజు (జనవరి 15) 4:05 ని.లకు చిత్రానికి సంబందించిన గ్లింప్స్ విడుదల చేసారు మేకర్స్. అయితే అది ఎలా ఉందొ చూసేద్దాం రండి..!
‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ అనుకున్నప్పటి నుంచి ఈ కథ చాల మంది హీరోల చేతులు మారుతూ చివరికి తెలుగు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ వద్దకు చేరింది అని విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ ద్వారా తెలుస్తుంది. ఓపెనింగ్ షాట్ నుంచే ఆసక్తి రేకెత్తించాడు దర్శకుడు వేణు. తెలంగాణ సంప్రదాయంలో భాగమైన ఎల్లమ్మ దేవత గురించి దర్శకుడు ఎదో గట్టిగానే చెప్పాలనుకుంటున్నట్టు అర్ధం అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అయితే గ్లింప్స్ ఫైనల్ షాట్ లో దేవి శ్రీ ప్రసాద్ గెటప్ ని రెవీల్ చేసారు. రగ్గుడ్ లుక్ తో దేవి ఉండగా ‘పర్శి’ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

ఎంతో మంది హీరోల చేతులు మారిన ఈ కథను దర్శకుడు ఏ విధంగా తెరకెక్కిస్తాడో చూడాలి మరి ఎందుకు అంటే బలగం వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత వేణు దర్శకత్వం వహిస్తుండటం, పైగా బడా నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో వస్తుండటంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఆల్రెడీ ఉండగా, విడుదలైన గ్లింప్స్ ఒక రేంజ్ లో ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటున్నారు సినీ వర్గాలు.
