మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడు’. 2014వ సంవత్సరం జనవరి 12న ఈ చిత్రం విడుదలయ్యింది.నేటితో ఈ చిత్రం విడుదలయ్యి 8 ఏళ్ళు పూర్తికావస్తోంది. శృతీ హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, కాజల్, అమీ జాక్సన్ వంటి వారు కూడా కీ -రోల్స్ పోషించారు. రాంచరణ్ కెరీర్ లో 7వ చిత్రంగా వచ్చిన ‘ఎవడు’ 2014 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
పోటీగా మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ చిత్రం ఉన్నప్పటికీ ‘ఎవడు’ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. హాలీవుడ్ మూవీ ‘ఫేస్/ఆఫ్’ ఇన్స్పిరేషన్ తో.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా ‘ఎవడు’ ని తీర్చిదిద్దాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
12.65 cr
సీడెడ్
7.95 cr
ఉత్తరాంధ్ర
4.70 cr
ఈస్ట్
3.35 cr
వెస్ట్
2.70 cr
గుంటూరు
3.59 cr
కృష్ణా
2.36 cr
నెల్లూరు
2.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
39.35 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
5.40 Cr
ఓవర్సీస్
1.75 Cr
మలయాళం
0.60 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
47.10 cr
‘ఎవడు’ చిత్రానికి రూ.44.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.47.10 కోట్ల షేర్ ను రాబట్టింది. టోటల్ గా బయ్యర్లకి రూ.2.6 కోట్ల వరకు లాభాలను అందించింది ఈ చిత్రం. నిజానికి ‘అత్తారింటికి దారేది’ సినిమా కంటే ముందే ‘ఎవడు’ విడుదల కావాల్సి ఉంది. కానీ అప్పటికీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైములో థియేటర్లు మూతపడడంతో సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ మంచి ఫలితాన్నే అందుకుంది ‘ఎవడు’ చిత్రం.