గతంలో కొన్ని తెలుగు సినిమాలు ట్రాజెడీ క్లైమాక్స్ వల్ల ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. మహేష్ బాబు (Mahesh Babu) చేసిన ‘బాబీ’ (Bobby) ఒక డిఫెరెంట్ అటెంప్ట్. కానీ క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్స్ చనిపోవడం అనేది ఆడియన్స్ కి రుచించలేదు. అలాగే సుమంత్ (Sumanth) ‘ప్రేమ కథ’ సినిమా కూడా క్లైమాక్స్ వరకు చాలా మందికి నచ్చింది. కానీ క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్స్ చనిపోతారు. సినిమా ప్లాప్. ‘ఒక ఊరిలో’ సినిమా క్లైమాక్స్ లో తరుణ్ (Tarun) , ‘భీమిలి కబడ్డీ జట్టు’ (Bheemili Kabaddi Jattu) క్లైమాక్స్ లో నాని (Nani), ‘చక్రం’ (Chakram) క్లైమాక్స్ లో ప్రభాస్ (Prabhas) ..
Bachhala Malli
ఇలా చాలా సినిమాల్లో ట్రాజెడీతో నిండిన క్లైమాక్స్ లు ఉంటాయి. ప్రభాస్ ‘యోగి’ (Yogi) సినిమా క్లైమాక్స్ లో కూడా హీరో మదర్ చనిపోకుండా ఉంటే.. అది బ్లాక్ బస్టర్ సినిమా అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఏదేమైనా వాటిని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరో చనిపోయినా ‘జర్సీ’ హిట్ అయ్యింది.
హీరోయిన్ ని రేప్ చేసినా ‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F) వంటి సినిమాలు ఆడాయి. హీరోయిన్ కి వేరే అబ్బాయితో పెళ్ళైపోయినా ‘బేబీ’ వంటి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సరే ఇప్పుడు ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) అనే సినిమా వచ్చింది. అల్లరి నరేష్ (Allari Naresh) ఇందులో హీరో. ఈ సినిమాలో హీరో ఓ మూర్ఖుడు అని టీం చెబుతూ వస్తోంది. క్లైమాక్స్ కూడా చాలా ట్రెజేడీతో నిండి ఉంటుందని సమాచారం.
కన్నీళ్లు పెట్టించే విధంగానే ఆ క్లైమాక్స్ ని డిజైన్ చేసాడట దర్శకుడు. చాలా వరకు ప్రభాస్ ‘యోగి’ తరహా క్లైమాక్స్ అని అంటున్నారు. మరి ఈసారి అలాంటి క్లైమాక్స్ ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు అల్లరి నరేష్ కి హిట్టు చాలా అవసరం? మరి ‘మచ్చల మల్లి’ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో.. తెలియాల్సి ఉంది.