రామ్‌చరణ్ (Ram Charan) – బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం చర్చలోకి వచ్చింది. అదే ఈ సినిమాలో ఉపేంద్ర (Upendra) నటిస్తున్నారా అని. ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘యుఐ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కారణంగానే ఈ డౌట్ మొదలైంది. ఈ నెల 20న ‘యూఐ’ (UI) సినిమా విడుదల కానుంది.
Upendra
ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి యువ దర్శకుడు బుచ్చిబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీంతో రామ్‌చరణ్ సినిమాలో కీలక పాత్ర కోసం ఉపేంద్రను తీసుకున్నారు అనే చర్చ మొదలైంది. ఎందుకంట ఉపేంద్రకు, బుచ్చిబాబుకు ఎక్కడా గత సంబంధాలు లేవు. ఇక నిర్మాతలతో పరిచయం అంటే.. ఈయన బాగా కొత్తాయే. దీంతో సినిమాలో నటిస్తున్నందుకే వచ్చారు అని. చరణ్ – బుచ్చిబాబు సినిమాలో ఓ సీనియర్ నటుడి పాత్ర ఒకటి ఉందని..
దాని కోసం విజయ్ సేతుపతిని (Vijay Sethupathi) సంప్రదించారని వార్తలొచ్చాయి. అయితే నేను నటించడం లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఆ పాత్ర కోసం ఉపేంద్రను కాంటాక్ట్ అయ్యారు అని తెలుస్తోంది. గతంలో ఆయన తెలుగులో ఇలాంటి పాత్రలు చేసి మెప్పించారు కూడా. మరిప్పుడు ఈ సినిమాను ఓకే చేస్తారా అనేది చూడాలి. మరోవైపు ఇదే వేదికగా.. బుచ్చిబాబు తెరకెక్కించిన ‘ఉప్పెన’ (Uppena) గురించి కూడా ఉపేంద్ర మాట్లాడారు. ఆ సినిమా చూసి ఆశ్చర్యపోయానని, ఆయనకు అదే తొలి సినిమా అంటే నమ్మలేకపోయానని చెప్పుకొచ్చారు.
అలాగే ఇప్పుడు రామ్ చరణ్‌తో ఆయన రూపొందిస్తున్న సినిమాపై అంచనాల గురించి కూడా మాట్లాడారు. మరోవైపు ఇదే వేదిక మీద చిరంజీవితో (Chiranjeevi) తాను గతంలో సినిమా తీయాలనుకున్న విషయాన్ని కూడా ఉపేంద్ర చెప్పారు. ఇవన్నీ కలిపితే పైన చెప్పిందే జరుగుతుంది అనిపిస్తోంది. మరి మన ఊహ కరక్టేనా? కాదా అనేది త్వరలో తేలుతుంది. సినిమా కొత్త షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ఉంటుంది అంటున్నారు. అప్పుడే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.