ఆ హీరోయిన్ కి ఫ్యాన్ కానీ కుర్రాడు లేదు, అందాలు ఆరబోయకుండా కేవలం హావభావాలతోనే అందర్నీ తన అభిమానులుగా మార్చేసుకొన్న ఈ కుందనపుబొమ్మ పరభాష నుండే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పరాయి భాషలో నటించినప్పుడే అమ్మడికి ఫ్యాన్స్ అయిపోయిన కుర్రకారు.. తెలుగులో నటించేసరికి గుండెల్లో అమ్మడి ఫోటోను ముద్రించేసుకొన్నారు. మంచి నటి దొరికినందుకు తెలుగు సినిమా కళామతల్లి కూడా సంతోషించింది. మామూలుగానే హిట్ హీరోయిన్ ను తమ సినిమాల్లో సైన్ చేసుకోడానికి వెంబడే ప్రొడ్యూసర్లు ఈ అమ్మాయికి కూడా ఆఫర్లతో సూట్ కేసులు పెట్టుకొని తిరిగారు.
కానీ.. క్యాష్ కంటే కథకి, క్యారెక్టర్ కి ఎక్కువ వేల్యూ ఇచ్చే సదరు సింపుల్ బ్యూటీ.. తనకు నచ్చిన రెండు స్క్రిప్ట్ లను ఎంచుకొని ఆ సినిమాకే వర్క్ చేయడం మొదలెట్టింది. అయితే.. ఓ యువ హీరో ఆమెను ఇబ్బందిపెడుతున్నాడని ఇన్నర్ సోర్స్. విపరీతమైన క్రేజ్ సంపాదించుకొన్న సదరు సుందరిని వశపరుచుకోవడం కోసం ఆ యంగ్ అండ్ సక్సెస్ ఫుల్ హీరో నానా యాగీ చేస్తున్నాడట. ఆ హీరో చేసిన హంగామాకి అసలు సినిమా వదిలేసి వెళ్లిపోదామనుకొన్న అమ్మాయి కాస్తా పెద్దలు సర్ధి చెప్పేసరికి ఆ ఆలోచన మానుకొని ప్రస్తుతం ఆ హీరోకి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ.. తన పని తాను చేసుకుంటూ పోతుందట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.