మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram), కొరటాల శివ (Koratala Siva).. ఇద్దరూ కూడా రైటర్స్ గా కెరీర్ ను ప్రారంభించారు. ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ గా ఎదిగారు. ఈ క్రమంలో ఈ స్టార్ డైరెక్టర్స్ తీసిన గత 5 సినిమాలు మరియు వాటి బడ్జెట్ కలెక్షన్స్ లెక్కలు ఒక లుక్కేద్దాం రండి :
Trivikram vs Koratala Siva
ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గత 5 సినిమాల బడ్జెట్ & కలెక్షన్స్ లెక్కలు :
నితిన్ (Nithin) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) (S. Radha Krishna) ఈ చిత్రాన్ని రూ.25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.75.4 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన మూడో సినిమా ఇది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని రూ.70 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.95 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని రూ.60 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.165 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన మూడో సినిమా ఇది.’హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.280 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన మూడో సినిమా ఇది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.172 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
కొరటాల శివ గత 5 సినిమాల బడ్జెట్ & కలెక్షన్స్ లెక్కలు :
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మొదటి సినిమా ఇది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని (Naveen Yerneni) , వై.రవిశంకర్ (Y .Ravi Shankar), మోహన్ చెరుకూరి (C . V. Mohan)..లు రూ.70 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. ఫుల్ రన్లో రూ.200 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది ఈ సినిమా.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మొదటి సినిమా ఇది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి..లు రూ.50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. ఫుల్ రన్లో రూ.135 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది ఈ సినిమా.
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన రెండో సినిమా ఇది. ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై డీవీవీ దానయ్య (D. V. V. Danayya) ఈ చిత్రాన్ని రూ.65 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.225 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. రాంచరణ్ (Ram Charan) కూడా గెస్ట్ రోల్ చేశాడు. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ ‘మాట్నీ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి (S. Niranjan Reddy), అన్వేష్ రెడ్డి..లు ఈ చిత్రాన్ని రూ.200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.80 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన రెండో సినిమా ఇది. ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni) ఈ చిత్రాన్ని రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.521 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.