ప్రయోగం పనికిరావాలి.. పుట్టి ముంచేలా ఉండకూడదు అంటారు. అలా తొలి రకం ప్రయోగాలు చేయడంలో సంగీత దర్శకుడు అనిరుథ్ (Anirudh Ravichander) సిద్ధహస్తుడు అని చెప్పాలి. అందుకే ఆయన సంగీతంలో ఇప్పటివరకు చేసిన చాలా ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయి. తాజాగా ఆయన రజనీకాంత్ (Rajinikanth) కొత్త సినిమా ‘కూలి’ (Coolie) కోసం చేసిన ప్రయోగం మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. రజనీకాంత్ – లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కూలి’. తలైవా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఓ పాట మ్యూజికల్ టీమ్ రిలీజ్ చేసింది.
Coolie
‘చిటుకు వైబ్’ అంటూ వచ్చిన ఆ మ్యూజికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడో విషయం ఏంటంటే.. ఆ పాట ఓ వైరల్ వీడియో నుండి తీసుకున్నదే. అది కూడా 13 ఏళ్ల పాత వైరల్ వీడియో నుండి. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘కూలి’ సినిమా టీమ్ నుండి ఎలాంటి సర్‌ప్రైజ్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. సాయంత్రానికి ఓ బిట్ సాంగ్ వచ్చింది. రజనీకాంత్‌ను టైమ్ మెషీన్‌లో వెనక్కి తీసుకెళ్లి పాత రోజుల్ని గుర్తు చేశారు లోకేశ్ కనగరాజ్.
ఆ లుక్, స్టెప్స్ పాత తలైవాను గుర్తు చేశాయి. ఆ పాట వెనుకే ఆసక్తికరమైన కథ ఉంది. శింబు (Silambarasan) తండ్రి, సీనియర్ నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు అయిన టిఎన్ రాజేందర్ (T. Rajendar) ఒక ఇంటర్వ్యూలో 13 ఏళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఆన్ స్పాట్ చిన్న పాట కంపోజ్ చేశారు. ఆ చిన్న ట్యూన్ ఆధారంగా ఆయన గొంతునే అనిరుధ్ ‘కూలి’ కోసం రీమిక్స్ చేసి మెప్పించారు.
ఒరిజినల్ వీడయోను యూట్యూబ్ కూడా చూడొచ్చు. ఎలాంటి వాయిద్యాలు లేకుండా భలే ఉంటుంది. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. రజనీకాంత్ – నాగార్జున (Nagarjuna) – ఉపేంద్ర (Upendra), – ఆమిర్ ఖాన్ (Aamir Khan) – శ్రుతి హాసన్ (Shruti Haasan) లాంటి స్టార్లు నటిస్తున్నారు. ఈ రేంజి కాస్టింగ్‌కి ఎంతటి వసూళ్లు సాధించాలి అని అనుకుంటున్నారో మీరే ఊహించుకోవచ్చు.