సాయి దుర్గ తేజ్ (Sai Dharam Tej) హీరోగా రోహిత్ కె పి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతుంది. ‘హనుమాన్’ (Hnauman) నిర్మాత కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి..లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి SYG (సంబరాల ఏటిగట్టు) అనే టైటిల్ ను ఖరారు చేస్తూ నిన్న ఓ గ్లింప్స్ ని వదిలారు. అంతేకాదు 2025 సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘విరూపాక్ష’ (Virupaksha) , ‘బ్రో’ (BRO) సినిమాల తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా ఇది.
Balakrishna Vs Sai Dharam Tej
ఇందులో తేజ్ చాలా మాసీగా కనిపిస్తున్నాడు. కార్నేజ్ అంటూ విడుదల చేసిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చూస్తుంటే ఇందులో మైథాలజీని కూడా టచ్ చేసినట్లు అనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. విచిత్రంగా నిన్న బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘అఖండ 2’ చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. 2021 లో విడుదలైన ‘అఖండ’ (Akhanda) పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రంతో బోయపాటి శ్రీను- బాలయ్య..లు హ్యాట్రిక్ కంప్లీట్ చేశారు.
దీంతో ‘అఖండ 2’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనిని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. మరి ఈ సినిమా రిలీజ్ రోజునే ‘SYG (సంబరాల ఏటిగట్టు) రిలీజ్ అవుతుందని ఆ సినిమా మేకర్స్ ప్రకటించడం గమనార్హం. గతంలో అంటే 2019 లో కూడా సాయి దుర్గ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ (Prati Roju Pandage) , బాలకృష్ణ ‘రూలర్’ సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయి. వాటిలో ‘రూలర్’ కి (Ruler) మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ టాక్ నెగిటివ్ గా రావడం వల్ల.. పోటీలో ‘ప్రతిరోజూ పండగే’ ముందు నిలబడలేకపోయింది.
మరి 2025లో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే సెప్టెంబర్ 25 అనేది పాన్ ఇండియా సినిమాలకి మంచి డేట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ టైంలో రిలీజ్ అయ్యే సినిమాలకి నార్త్ లో కూడా మంచి రీచ్ ఉంటుందట. పైగా ఈ రెండు సినిమాలకు మైథాలజీ టచ్ ఇస్తున్నారు కాబట్టి.. అక్కడ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే.. తెలుగు సినిమా స్థాయి మరింతగా పెరిగినట్టే అని చెప్పాలి.