Hero , Heroine: నెట్టింట వైరల్ అవుతున్న పెళ్లి వీడియో ఏ హీరో, హీరోయిన్‌దంటే..?

సోషల్ మీడియా కారణంగా ఎప్పటికప్పుడు షాకింగ్, సర్‌ప్రైజ్ వార్తలు వైరల్ అవుతుంటాయి.. సెలబ్రిటీలకు సంబంధించిన గాసిప్స్ గురించి అయితే కొత్తగా చెప్పక్కర్లేదు.. పువ్వు పూసింది అంటే కాయ కాసింది.. మేం కోసుకుతిన్నాం అనేంతలా పుకార్లు పుట్టించేస్తుంటారు.. పాపం తర్వాత వాటి గురించి క్లారిటీ ఇవ్వలేక సెలబ్స్‌కి తల ప్రాణం తోకకి వచ్చినంత పనవుతుంది.. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ పెళ్లి చేసేసుకున్నాడు.. అదికూడా ఆల్ రెడీ పెళ్లైన మహిళని.. ఆమె కూడా హీరోయిన్ కావడం విశేషం.. ఇదీ ఆ వార్తల సారాంశం.. వివరాల్లోకి వెళ్తే..

కార్తీక్ ఆర్యన్ పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే.. కానీ అది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. కియారా అద్వానీ.. పెళ్లి చేసుకోవడమే కాదు.. ఆమెతో కలిసి ఏడడుగులు కూడా వేశాడు.. వీరిద్దరూ జంటగా.. ‘ఆనంది గోపాల్’ అనే మరాఠీ సినిమాకి గానూ నేషనల్ అవార్డ్ అందుకున్న సమీర్ విద్వాంస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కోసం మ్యారేజ్ సీన్ షూట్ చేశారు..

ఇందులో భాగంగా షేర్వాణీ ధరించిన కార్తీక్ ఎమోషనల్ అవుతుండగా.. కియారా కూడా మ్యాచింగ్ లెహంగాకి ఎర్రటి దుప్పట్టాతో రాయల్‌గా కనిపించింది.. ఇద్దరూ చేతిలో చెయ్యివేసుకుని ఏడడుగులు నడిచారు.. ఆ వీడియో కాస్తా లీక్ అవడంతో నెట్టింట వైరల్‌గా మారింది.. ముందు ఈ సినిమాకి ‘సత్యనారాయణ్ కీ కథ’ అనే టైటిల్ అనుకున్నారు.. పేరు మీద అభ్యంతరాలు వ్యక్తమవడంతో ‘సత్య ప్రేమ్ కీ కథ’ గా మార్చారు.. జూన్ 29 రిలీజ్ ఫిక్స్ చేశారు..

ఇక కార్తీక్ (Hero )ఇటీవల ‘అల వైకుంఠపురములో’ రీమేక్ ‘షెహ్ జాదా’ లో నటించాడు.. సినిమా అక్కడ డిజాస్టర్ అయ్యింది.. కియారా, రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం ‘గేమ్ ఛేంజర్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. మొత్తానికి ఇటీవలే వివాహం చేసుకున్న కియారా.. సినిమా పెళ్లి వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచింది..


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus