‘హుషారు’ (Hushaaru) సినిమాలో ఆర్య పాత్రతో పాపులర్ అయ్యాడు తేజస్ కంచర్ల (Tejus Kancherla) . దీనికి ముందు ‘కేటుగాడు’ అనే సినిమాలో కూడా నటించినా అతనికి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ‘హుషారు’ అనే చెప్పాలి. ఆ తర్వాత పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) తో కలిసి ఇతను ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ అనే సినిమా కూడా చేశాడు. అయితే ఆ తర్వాత ఇతను ఎందుకో సినిమాలు చేయలేదు. కొంత గ్యాప్ తీసుకుని ‘ఉరుకు పటేలా’ (Uruku Patela) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
‘లీడ్ ఎడ్జ్ పిక్చర్స్’ బ్యానర్‌పై కంచర్ల బాల భాను నిర్మించిన ఈ చిత్రాన్ని వివేక్ రెడ్డి (Vivek Reddy) డైరెక్ట్ చేశాడు. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు మీడియాతో ముచ్చటించాడు హీరో తేజస్ (Tejus Kancherla) . ఈ క్రమంలో అతనికి ఎన్నో ప్రశ్నలు మీడియా నుండీ ఎదురయ్యాయి. అందులో ‘తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇలాంటి టైంలో ‘మీ సినిమా రిలీజ్’ అనేది ఎంతవరకు కరెక్ట్? అలాగే వరద బాధితులను ఆదుకునేందుకు మీరెందుకు ముందుకు రాలేదు?’ అంటూ అతనికి ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి అతను ఆసక్తికర సమాధానమిచ్చాడు. ‘నా సినిమా గ్రాండ్ గా ఏమీ రిలీజ్ అవ్వడం లేదు. కొన్ని థియేటర్లు మాత్రమే దక్కాయి. మొదటి రెండు షోలు జనాలు సినిమాకి వస్తారన్న గ్యారెంటీ ఏమీ లేదు.పూజలో ఉంటారు కాబట్టి..! తర్వాత కూడా టాక్ బాగుంటే వస్తారు.
దాన్ని బట్టి నా సినిమా రన్ ఉంటుంది. నేనేమీ మహేష్ బాబుని (Mahesh Babu) కాదు.. నా సినిమా పెద్ద స్థాయిలో రిలీజ్ అవ్వడానికి..! కలెక్షన్స్ భారీగా రావడానికి..! అయినా నేను వరద బాధితుల కోసం నా వంతు సాయం చేశాను. నా ఫ్రెండ్స్ ఎన్జీవోస్ నడుపుతున్నారు. వాళ్ళకి నా వంతుగా కొంత డబ్బు ఇవ్వడం జరిగింది. ఒకవేళ నా ‘ఉరుకు పటేలా’ సినిమాకి హిట్ టాక్ వచ్చి.. డబ్బులు వచ్చాయి అంటే కచ్చితంగా వరద బాధితులకు ఇంకా సాయం చేస్తాను’ అంటూ సమాధానం ఇచ్చాడు తేజస్ కంచర్ల (Tejus Kancherla).