మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సందడి మొదలుకానుంది. ఇప్పటికే సీజన్ 9 కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ చాలా మంది ఇన్ఫ్లూయెన్సర్ల పేర్లు వినిపిస్తున్నాయి. మునుపటి సీజన్ కి సరైన స్థాయి ఇంటరాక్షన్ రాకపోవడంతో ఈ కొత్త సీజన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు బిగ్ బాస్ బృందం. అయితే.. ఈ సీజన్ ను ఓ కొత్త హోస్ట్ ను తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ యూనిట్ ప్రయత్ని(Bigg Boss 9 Telugu) స్తోందట. తెలుగు సీజన్ మొదలైంది జూనియర్ ఎన్టీఆర్ తో (Jr NTR) అయినప్పటికీ.. ఆ తర్వాతి సీజన్ ను నాని హోస్ట్ చేసారు.
అయితే.. నానికి వచ్చిన నెగిటివిటీతో మరో సీజన్ హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపించలేదు. దాంతో నాగార్జున (Nagarjuna) రంగంలోకి దిగారు. స్టూడియో కూడా ఆయనదే కావడంతో హోస్టింగ్ & రెంటల్ కలిపి మంచి ప్యాకేజ్ తీసుకున్నారు నాగార్జున. అందుకే ఆల్మోస్ట్ 7 సీజన్లు సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేసారు. ఆయన సినిమాల్లో బిజీగా ఉండి ఎపిసోడ్ షూట్ కి అందుబాటులో లేనప్పుడు తన పరిచయాలు ఉపయోగించి సమంత వంటి స్టార్లతో కొన్ని ఎపిసోడ్స్ హోస్ట్ చేయించాడు కూడా.
అటువంటి నాగార్జునను ఈ ఏడాది బిగ్ బాస్ బృందం ఓ యంగ్ హీరోతో రీప్లేస్ చేయనుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సీజన్ 9 (Bigg Boss 9 Telugu) హోస్ట్ గా విజయ్ దేవరకొండను (Vijay Devarakonda) ఫైనల్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఈ వార్తకు సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది.
కన్నడ బిగ్ బాస్ కు కూడా సుదీప్ గుడ్ బై చెప్పాడు. సో ఈ ఏడాది తెలుగు, కన్నడ బిగ్ బాస్ సీజన్లలో కొత్త హోస్ట్ లను చూడనున్నామన్నమాట. అయితే.. ఒకవేళ విజయ్ దేవరకొండ ఈ సీజన్ ను హోస్ట్ చేసే అవకాశం దక్కించుకుంటే గనుక అతడి ఇమేజ్ కు మంచి మేకోవర్ లా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ & టీవీ ఆడియన్స్ కు మరింత చేరువవుతాడు కూడా.