మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) కొంచెం తుత్తర ఎక్కువ అని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. ఎందుకంటే ఆయన మైక్ పట్టుకుంటే.. దాదాపు అరగంట సేపు మాట్లాడతారు. ఆ అరగంట టైంలో ఆయన ఎవరి గురించి అయితే మాట్లాడాలి అని అనుకుంటారో వాళ్ళ పేర్లు మర్చిపోతారు.. అదే టైంలో తన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక ముఖ్య విషయాన్ని లీక్ చేసేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని చిరు కూడా ఒప్పేసుకున్నారు. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నట్టు కూడా పలు సందర్భాల్లో తెలిపారు.
అయితే చిరు అనుకోకుండా లీక్ చేసినా.. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేవి. దీంతో అదే పద్దతిని ఫాలో అవ్వాలి అనుకున్నారో ఏమో కానీ.. మరికొంతమంది దర్శకులు, నటీనటులు తమ సినిమాలకు సంబంధించిన లీకులు ఇవ్వడం జరిగింది. కానీ చిరు ఇచ్చిన లీకుల రేంజ్లో అవి వైరల్ కాలేదు. అయితే ఇప్పుడు చిరు బాటలో దిల్ రాజు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. విషయం ఏంటంటే.. దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో రూపొందిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమా మార్చి 7న రీ- రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా దిల్ రాజు (Dil Raju) కెరీర్లో చాలా స్పెషల్ మూవీ. అందుకే ఈ సందర్భంగా ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా.. దిల్ రాజు తన నెక్స్ట్ సినిమాల గురించి స్పందించారు. ఇందులో భాగంగా.. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)- దర్శకుడు రవి కిరణ్ కోలా (Ravi Kiran Kola) కాంబినేషన్లో చేయబోతున్న సినిమా టైటిల్ ని లీక్ చేశారు. వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు లీక్ చేశారు.