పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కాదంటే ఔననిలే, ఔనంటే కాదనిలే అని అంటుంటారు మాలీవుడ్‌లో. అక్కడ అలా ఎందుకు అంటారో తెలియదు కానీ.. ఇక్కడ తెలుగు సినిమాల విషయంలో మాత్రం ఆయన ఎక్కువగా అలానే చెబుతూ ఉంటారు. ‘సలార్’ (Salaar) సినిమా విషయంలో నో నో అంటూ సినిమాలో నటంచేశాడు. ఇప్పుడు మహేష్‌బాబు (Mahesh Babu) – రాజమౌళి (S. S. Rajamouli) సినిమా విషయంలోనూ అదే పని చేస్తారు అని కొన్ని రోజుల క్రితం మనం అనుకున్నాం. ఇప్పుడు అదే నిజమైంది అనిపిస్తోంది.
మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో SSRMB వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలొచ్చాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుండి కానీ, ఆయన నుండి కానీ క్లారిటీ రాలేదు. ‘చర్చలు జరుగుతున్నాయ’ అని ఆ మధ్య పృథ్వీరాజ్ చెప్పారు. అయితే ఆ సినిమా ఓకే అయింది అని ఇన్‌డైరెక్ట్‌గా పోస్టు ద్వారా చెప్పాడు.
పృథ్వీరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తాజా పెట్టిన ఓ పోస్ట్ ఈ విషయాన్ని చెప్పేలా ఉంది. ‘‘దర్శకుడిగా నా చేతిలోని సినిమాని, దాని మార్కెటింగ్ పనుల్ని పూర్తి చేశాను. నటుడిగా నా తదుపరి సినిమాలోకి అడుగు పెట్టే సమయం వచ్చేసింది. ఆ పరభాషా చిత్రంలో పెద్ద డైలాగ్స్ ఉన్నాయని తెలిసి కాస్త భయపడుతున్నా’’ అని పృథ్వీరాజ్ సుకుమార్ రాసుకొచ్చారు.
దీంతో ఆయన చెబుతున్న సినిమా మహేష్ – రాజమౌళిదే అని నెటిజన్లు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇక ఈ సినిమా నటీనటులకు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటనా రాలేదు. ప్రియాంక చోప్రా నటిస్తోంది అనే విషయం కూడా ఆమె రీసెంట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల వల్లే తెలిసింది. త్వరలో రాజమౌళి ఓ ప్రెస్ మీట్ పెట్టి తన కాస్ట్ అండ్ క్రూని పరిచయం చేస్తారని సమాచారం. అలాగే సినిమా ప్లాట్ కూడా చెబుతారు అని అంటున్నారు. ఆయన ఆనవాయితీ కూడా ఇదే కావడం గమనార్హం.