Prabhas Marriage: పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్!

స్టార్ హీరో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. బాహుబలి సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ తన ప్రతి సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగడం గమనార్హం. ప్రభాస్ పెళ్లి గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా తాను పెళ్లి చేసుకుంటానని అయితే ఎప్పుడు చేసుకుంటానో మాత్రం చెప్పలేనని ప్రభాస్ ఇంటర్వ్యూలలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ప్రముఖ నటీమణులలో ఒకరైన శ్రీ రాపాక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి అయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని వెల్లడించారు. ప్రభాస్ అంటే తనకు క్రష్ అని శ్రీ రాపాక చెప్పుకొచ్చారు. తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమని ప్రభాస్ మూవీలో ఛాన్స్ వస్తే వదులుకునే అవకాశం లేదని ఆమె వెల్లడించారు. ప్రభాస్ బుల్లితెరపై సినిమాలలో కనిపించినా ఆయనను చూస్తే అలాగే ఉండిపోతానని శ్రీ రాపాక అన్నారు. శ్రీ రాపాకకు భవిష్యత్తులో ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కుతుందేమో చూడాలి.

శ్రీరాపాక పలు సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా కూడా పని చేశారు. మరోవైపు ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ప్రభాస్ సినిమాతో మారుతి బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. మారుతి పరిమిత బడ్జెట్ తోనే ప్రభాస్ సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుందా లేదా అనే విషయానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ మారుతి ప్రాజెక్ట్ కు సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus