యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తారని తనకు వచ్చిన పాత్రలో ఆయన జీవించేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు మాస్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే స్క్రిప్ట్ లకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖాతాలో ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి.
అయితే ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు తారక్ ఫ్యాన్స్ కు నచ్చిన సినిమాలు కావడం గమనార్హం. తారక్ కెరీర్ లోని డిజాస్టర్ల జాబితాను పరిశీలిస్తే ఈ జాబితాలో ఆంధ్రావాలా సినిమా పేరు ముందువరసలో ఉంటుంది. పూరీ డైరెక్షన్ లో తెరకెక్కి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. అయితే నిమ్మకూరులో జరిగిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ గురించి ఇప్పటికీ చర్చ జరుగుతోంది.
ఈ ఫంక్షన్ కు హాజరైన స్థాయిలో అభిమానులు మరే ఈవెంట్ కు హాజరు కాలేదు. ఈ ఈవెంట్ కు హాజరైన జనాలను చూసి అప్పటి స్టార్ హీరోలతో పాటు రాజకీయ నేతలు సైతం షాకయ్యారు. అయితే ఈ ఈవెంట్ జరిగి 19 సంవత్సరాలు అయింది. ఈ 19 సంవత్సరాలలో తారక్ నటుడిగా ఎన్నో మెట్లు పైకి ఎదిగారనే సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా రైళ్లు, బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది.
దాదాపుగా 10 లక్షల మంది అభిమానులు హాజరైన ఈ రికార్డును రాబోయే రోజుల్లో కూడా మరో స్టార్ హీరో బ్రేక్ చేయడం సులువు కాదు. భారీ అంచనాలతో విడుదలైన ఆంధ్రావాలా కలెక్షన్ల విషయంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవకపోయినా నిర్మాతలకు నష్టాలు మాత్రం రాలేదు. 2004 సంవత్సరం జనవరి 1వ తేదీన విడుదలైన ఆంధ్రావాలా థియేటర్లలో హిట్ కాకపోయినా బుల్లితెరపై మాత్రం ఆకట్టుకుంది.