Yuvarathnaa Collections: దగ్గర వరకూ వచ్చింది కానీ ఇక కష్టమే..!

కన్నడ పవర్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘యువరత్న’.కన్నడంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని అదే పేరుతో రిలీజ్ చేశారు. ‘అఖిల్’ ఫేమ్ సాయేషా సైగల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సాయికుమార్ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 1న విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్ ను సంపాదించుకుంది. హీరో పెద్దగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా ‘కె.జి.ఎఫ్’ నిర్మాతలైన ‘హోంబెల్ ఫిలిమ్స్’ వారు ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడంతో కలెక్షన్లు పర్వాలేదు అనిపించాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్లను గమనిస్తే :

నైజాం   0.20 cr
సీడెడ్   0.13 cr
ఉత్తరాంధ్ర   0.15 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)   0.48 cr (షేర్)

‘యువరత్న’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కె.జి.ఎఫ్ నిర్మాతలు డిస్ట్రిబ్యూట్ చేశారు. వాళ్ళే ఈ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి 0.55కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 0.47 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 0.07కోట్ల షేర్ ను రాబట్టాలన్న మాట. వీకెండ్ వరకూ బానే పెర్ఫార్మ్ చేసిన ఈ చిత్రం ఆ తరువాత స్లీపేసింది.

Click Here To Read Movie Review

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus