Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Y. V. S. Chowdary: సీనియర్ దర్శకుడు వై వి ఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం

Y. V. S. Chowdary: సీనియర్ దర్శకుడు వై వి ఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం

  • September 26, 2025 / 12:03 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Y. V. S. Chowdary: సీనియర్ దర్శకుడు వై వి ఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం

సీనియర్ దర్శకుడు వై వి ఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆయన తల్లి గారు అయినటువంటి యలమంచిలి రత్నకుమారి గారు ఈ గురువారం నాడు అనగా సెప్టెంబర్ 25న రాత్రి 8 గంటల 31 నిమిషాలకు కన్నుమూశారు. ఆమె వయసు 88 ఏళ్ళు అని తెలుస్తుంది. వయోభారంతోనే ఆమె మరణించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు వై వి ఎస్ చౌదరి తన తల్లిని తలుచుకుని చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Y. V. S. Chowdary

వై వి ఎస్ చౌదరి తన తల్లి రత్నకుమారిని తలుచుకుంటూ.. “మన పెద్దలు కొంత మందిని చూసి ‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికొస్తార్రా మీరు?’ అంటూ చదువుకోనివాళ్ళని చూసి మందలిస్తూండేవారు. ఆ సామెతకు అచ్చు గుద్దినట్లు సరిపోయే స్త్రీశక్తే మా అమ్మ.. ‘యలమంచిలి రత్నకుమారి’గారు.

yvs chowdary mother passed away

కానీ.. ఒక లారీడ్రైవర్‌ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’గారి నెలసరి సంపాదనతో.. తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యంతో పాటు.. సినిమాలు చూపించడం నుండీ దేవాలయ దర్శనాలు, సీజనల్‌ పిండివంటలు, నిలవ పచ్చళ్ళు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్.. ఇత్యాది అవసరాలకు.. తన నోటి మీది లెక్కలతో బడ్జెట్‌ని కేటాయించిన ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మగారు..!

వీటన్నింటికీ మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలి అనే తపనతో.. అన్నీ తానై మమ్మల్ని పెంచడానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మగారు..!

అలా మా అమ్మగారికి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా తన యొక్క ఆ విధానాలతో మాలో కూడా ఆ స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మ.అటువంటి మా అమ్మగారు (88 యేళ్ళు) ఈ గురువారం, 25వ సెప్టెంబర్ 2025, సాయంత్రం గం 8.31ని॥లకు.. ఈ భువి నుండి సెలవు తీసుకుని.. ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని, మా అన్నగారిని కలవడానికి వెళ్ళిపోయారు.

ఇట్లు ఆవిడ పంచిన రక్తం,ఆవిడ నింపిన లక్షణాలతో..మీ వై. వి. ఎస్‌. చౌదరి” అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు. ఆయన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

‘ఓజి’ టైటిల్ ఎన్టీఆర్ కోసం రిజిస్టర్ చేయించుకున్నాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director YVS Chowdary
  • #Tollywood
  • #Tollywood Director
  • #YVS chowdary
  • #YVS chowdary mother

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

18 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

22 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

1 day ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

23 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

24 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

1 day ago
Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version