‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత రాంచరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని తన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇది దిల్ రాజు బ్యానర్లో రూపొందుతున్న 50వ సినిమా. కాబట్టి.. ఆయన తన కెరీర్లోనే అత్యధికంగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నాడు. కానీ అనుకున్నదానికంటే అత్యంత భారీగా ఈ చిత్రం బడ్జెట్ రూ.280 కోట్ల వరకు అయినట్టు ఇన్సైడ్ టాక్.
ఇదే దిల్ రాజుని చిక్కుల్లో పడేసింది ఇప్పుడు. ఈ సినిమాకి ఇంత బడ్జెట్ అవుతుంది అనుకున్న దిల్ రాజు మొదట దిల్ మరియు శాటిలైట్ హక్కులను భారీ రేటుకి ‘జీ’ సంస్థకు అమ్మేశారు. అది కూడా 3,4 డిస్కషన్లు అయిన తర్వాత. కానీ ఇప్పుడు బడ్జెట్ భారీగా పెరగడంతో ఆ డీల్ గురించి ఇంకోసారి డిస్కస్ చేయాలి అని జీ సంస్థతో సంప్రదింపులు మొదలుపెట్టారట దిల్ రాజు. కానీ అందుకు ఆ సంస్థ అంగీకరించడం లేదు.
పెద్ద సినిమాలకు పెట్టిన బడ్జెట్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే సగానికి పైగా రికవరీ అయిపోతూ ఉంటాయి. చరణ్ – శంకర్ ల సినిమాకి దిల్ రాజు పెట్టిన బడ్జెట్ అంతా నాన్- థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చిందే.అంతేకాకుండా ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత చరణ్ పారితోషికం కూడా పెంచేశాడు.ఇక శంకర్ మేకింగ్ కాస్ట్ రోజురోజుకు పెంచుతూనే ఉన్నాడు. ఇంత బడ్జెట్ పెట్టినా ఇప్పటివరకు సినిమా 60 శాతం మాత్రమే కంప్లీట్ అయ్యింది.
కానీ ఇప్పుడు బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో ఆయన ఓటీటీ మరియు శాటిలైట్ డీల్ విషయంలో మళ్ళీ డిస్కషన్లు పెట్టి ఎంతో కొంత రాబట్టుకోవాలి అనుకున్న దిల్ రాజుకి పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఇక 2023 దసరాకి విడుదల చేయాలి అనుకున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యింది. అది కూడా గ్యారెంటీ అయితే కాదు.