ఒక్క సినిమా రిలీజ్ చేయని స్టార్స్ వీళ్లే !

టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు తమ ఫేవరెట్ హీరోల సినిమాలు సంవత్సరానికి కనీసం ఒక సినిమా అయినా రిలీజైతే బాగుంటుందని భావిస్తారు. అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ ఏడాది చాలామంది స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా సెకండ్ వేవ్ వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాలను వాయిదా వేశారు. కొంతమంది స్టార్ హీరోల కెరీర్ లో 2021 సంవత్సరం జీరో రిలీజ్ ఇయర్ గా నిలిచింది.

అయితే వచ్చే ఏడాది తమ ఫేవరెట్ హీరోల సినిమాలు రిలీజవుతూ ఉండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన సినిమాలేవీ ఈ ఏడాది రిలీజ్ కాలేదు. అయితే 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ కాలేదు.

అయితే వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో మహేష్ నటించిన సర్కారు వారి పాట రిలీజ్ కానుంది. మరో స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ కాలేదు. 2022 సంవత్సరం జనవరి 14వ తేదీన ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలేవీ ఈ ఏడాది రిలీజ్ కాలేదు. అయితే సీనియర్ హీరోలైన బాలయ్య, వెంకీ, నాగ్ సినిమాలు మాత్రం ఈ ఏడాది రిలీజయ్యాయి.

యూత్ ఐకాన్ గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ నటించిన ఒక్క సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ కాలేదు. ఈ హీరోలు జీరో రిలీజ్ స్టార్స్ గా మిగిలిపోగా ఈ హీరోల సినిమాలు వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది. ఈ స్టార్ హీరోలు తమ సినిమాలు కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయనే నమ్మకంతో ఉన్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus