మహేష్ బాబు గొప్ప మనసు గురించి వివరించిన ‘జిన్నా’ దర్శకుడు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా చాలా మంది గుండెల్లో హీరోగా నిలిచాడు. ఇప్పటికే ఆయన 1000 మందికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించాడు. మరోపక్క తాను దత్తత తీసుకున్న రెండు గ్రామాల్లోని ప్రజలకు విద్యా, వైద్యం వంటి సదుపాయాలు సమకూరుస్తున్నాడు. తన టీంతో.. నమ్రత హయాంలో ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది టెక్నీషియన్లకు, చిన్న చిన్న ఆర్టిస్ట్ లకు మహేష్ సాయం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఇటీవల విష్ణుతో ‘జిన్నా’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఈషాన్ సూర్య.. తనకు మహేష్ చేసిన సాయం గురించి వివరించాడు. ఇతను శ్రీను వైట్ల దగ్గర చాలా సినిమాలకు రైటర్ గా పనిచేశాడు. ఆ టైంలో మహేష్ తో ఇతనికి పరిచయం ఏర్పడింది. ఇతను దర్శకుడిగా మారడానికి ప్రయత్నిస్తూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న టైంలో తన పిల్లల చదువు కోసం చాలా ఇబ్బందులు పెట్టాడట. ఒకసారి వాళ్ళ చదువు ఆగిపోయే పరిస్థితి వస్తే..

వేరే ఆప్షన్ లేక మహేష్ బాబు వద్దకు వెళ్ళాడట. అప్పుడు ఇతను సాయం అడగడానికి సంకోచిస్తుంటే .. మహేష్ చొరవ చేసుకుని అడిగాడట. విషయం తెలిసాక ‘ఈ మాత్రం దానికి ఇంత ఇబ్బంది పడతావ్ ఏంటి?’ అని చెప్పి మేనేజర్ ను పిలిచి ‘ఏం కావాలో చూసుకోండి’ అని చెప్పాడట. ఆరోజు మహేష్ బాబు అండగా నిలబడకపోతే తన పిల్లల చదువు ఆగిపోయేది అంటూ దర్శకుడు ఈషాన్ సూర్య చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus