Zombie Reddy Collections: ‘హనుమాన్’ కాంబోలో వచ్చిన ‘జాంబీ రెడ్డి’ కి 4 ఏళ్ళు .. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Ad not loaded.

తేజ సజ్జ  (Teja Sajja)  , ప్రశాంత్ వర్మ (Prasanth Varma)  కాంబినేషన్ అనగానే అందరికీ ‘హనుమాన్’ (Hanuman) సినిమా గుర్తుకొస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. హిందీలో అయితే ఏకంగా రూ.50 కోట్ల పైనే గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అయితే తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ‘జాంబీ రెడ్డి’ (Zombie Reddy). 2021 ఫిబ్రవరి 5న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

Zombie Reddy Collections:

‘యాపిల్ ట్రీస్ స్టూడియోస్’ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆనంది (Anandhi) హీరోయిన్ గా నటించగా దక్ష నగార్కర్ (Daksha Nagarkar) కీలక పాత్ర పోషించింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి ఫుల్ రన్లో ఈ సినిమా (Zombie Reddy) బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో.. ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 1.98 cr
సీడెడ్ 1.16 cr
ఉత్తరాంధ్ర 0.69 cr
ఈస్ట్ 0.51 cr
వెస్ట్ 0.39 cr
కృష్ణా 0.52 cr
గుంటూరు 0.52 cr
నెల్లూరు 0.33 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 6.10 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.22 cr
ఓవర్సీస్ 0.33 cr
టోటల్ వరల్డ్ వైడ్ 6.65 cr (షేర్)

‘జాంబీ రెడ్డి’ చిత్రం రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఫుల్ రన్లో ఈ సినిమా రూ.6.65 కోట్ల షేర్ ని రాబట్టింది. మొత్తంగా రూ.1.65 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ అనిపించుకుంది. ఇక ‘జాంబీ రెడ్డి’ కి సీక్వెల్ గా ‘జాంబీ రెడ్డి 2’ కూడా రాబోతుంది. సుపర్ణ్ వర్మ ఈ సీక్వెల్ ను డైరెక్ట్ చేయనున్నాడు. ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ అందించబోతున్నాడు.

16 ఏళ్ళ క్రితం ఇప్పటి పాన్ ఇండియా స్టార్లకి పెద్ద షాక్ ఇచ్చిన సిద్దార్థ్.. మైండ్ బ్లాక్ అంతే..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus