‘అఖండ’ హ్యాట్రిక్‌తో ‘సింహా’, ‘లెజెండ్’ లను మించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఈ మూవీతో కెరీర్‌లో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టాడు బాలయ్య.. సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో బాక్సాఫీస్ బరిలో తన సింహగర్జన ద్వారా చూపించడమే కాక.. పాండమిక్ తర్వాత ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకొచ్చేాలా చేసి.. విడుదల వాయిదాలతో సతమతమవుతున్న తెలుగు చిత్రసీమకి సరికొత్త ఊపునీ, ఉత్సాహాన్నీ ఇచ్చారు.. ‘అఖండ’ గా బాలయ్య నటవిశ్వరూపాన్ని చూడ్డానికి పల్లెటూళ్ళల్లో ట్రాక్టర్లు వేసుకుని మరీ వచ్చిన ప్రేక్షకాభిమానులతో జాతర వాతావరణాన్ని తలపించాయి సినిమా హాళ్లు..
రెండు పాత్రల్లో బాలయ్య అద్భుత నటన.. ముఖ్యంగా అఘోరాగా నట విశ్వరూపం చూపించాడు నటసింహ.. ఇక ఎమ్. రత్నం డైలాగ్స్ థియేటర్లలో డైనమెట్స్‌లా పేలాయి.. థమన్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో గూస్ బంప్స్ తెప్పించడమే కాక.. హాళ్లల్లో స్పీకర్లు పగిలిపోయేలా.. మంటలొచ్చేలా చేశాడు.. థమన్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్ఆర్ వర్క్ అంటే ‘అఖండ’ అనేంతగా పేరు తీసుకొచ్చింది తనకి.. 2021 డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన బాలయ్య బ్లాక్ బస్టర్ ‘అఖండ’ 2022 డిసెంబర్ 2 నాటికి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ సినిమా సృష్టించిన కొన్ని సంచలనాల గురించి ఇప్పుడు చూద్దాం..
20 ఏళ్ల తర్వాత క్రాస్ రోడ్స్‌లో కోటి కొల్లగొట్టిన బాలయ్య!
2001 లో ‘నరసింహ నాయుడు’ రూ. 1 కోటి రూపాయల మార్క్ టచ్ చేసింది. దాని తర్వాత 20 సంవత్సరాలకు ‘అఖండ’ సేమ్ ఫీట్ రిపీట్ చేసింది. బాలయ్య కెరీర్‌లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రూ. కోటి రాబట్టిన రెండవ సినిమాగా ‘అఖండ’ నిలిచింది. సుదర్శన్ థియేటర్‌లో 53వ రోజు మ్యాట్నీతో ఈ ఘనత సాధించాడు నటసింహ..
ఓటీటీలోనూ సెన్సేషన్..
తెలుగు ఇండస్ట్రీ చాలా రోజుల తర్వాత 50 రోజుల పోస్టర్ చూసింది ఈ చిత్రంతోనే.. 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది.. డిస్నీ+ హాట్‌స్టార్‌లో డిజిటల్ రిలీజ్ అంటూ గ్రామాల్లో రోడ్ల పక్కన థియేట్రికల్ రిలీజ్ రేంజ్‌లో భారీ కటౌట్స్ పెట్టారు.. ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తే.. ఊళ్ళల్లో స్క్రీన్స్ వేసుకుని మరీ చూశారంటే ఇక క్రేజ్ పిచ్చ పీక్స్ అని చెప్పడం కూడా తక్కువే.. రిలీజ్ చేసిన 24 గంటల్లో ఏకంగా 1 మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు 10 వారాలకు పైగా టాప్ 10 ప్లేస్‌లో కొనసాగడం విశేషం..
బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ డిమాండ్!
‘అఖండ’ మూవీని హిందీలో రిలీజ్ చెయ్యాలంటూ నార్త్ ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ‘‘అఖండ’ మూవీ.. ప్రౌడ్ ఫర్ సనాతన్ ధర్మ’’ అంటూ హిందీ వెర్షన్ రిలీజ్ చెయ్యాలని కోరారు.. దీని కోసం ఈ #WeWantAKHANDAInHindi హ్యాష్ ట్యాగ్ వాడాలంటూ ట్రెండ్ చేశారు.‘‘హిందీలో కనుక రిలీజ్ చేసుంటే ఈజీగా మరో 50 కోట్లు వచ్చేవి.. ఎందుకంటే కథలో యూనివర్సల్ అప్పీల్ ఉంది..
ప్రకృతిని, ప్రజలను, దేవాలయాలను కాపాడుకోవాలనే మెసేజ్ ఉంది కాబట్టి అక్కడి వాళ్లకి కూడా బ్రహ్మాండంగా నచ్చుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అనుకున్నదానికంటే ఎక్కువే పలికాయి’’ అంటూ సామాజిక మాధ్యమాలలో బాలయ్య ఫ్యాన్స్, మూవీ లవర్స్ డిస్కస్ చేసుకున్నారు. ఇంతకుముందు బాలయ్య సినిమాలు కొన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టాయి. ఇప్పుడు నార్త్ ప్రేక్షకులకు శివుడంటే అమితమైన భక్తి కాబట్టి ‘అఖండ’ చిత్రాన్ని హిందీలో చూడాలనుకుంటున్నారు.
రీ రిలీజ్‌లోనూ సత్తా చాటింది..
ప్రస్తుతం సరైన సినిమాలు లేక థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లాలో కొన్ని ఏరియాల్లో (దాదాపు 15 స్క్రీన్స్) ‘అఖండ’ మూవీని రీ రిలీజ్ చేశారు. విచిత్రం ఏంటంటే.. ఓటీటీ, టీవీలో వచ్చినా కానీ.. దాదాపు సంవత్సరం తర్వాత రీ రిలీజ్ చేసినా కూడా ఫ్యాన్స్, ఆడియన్స్ థియేటర్లకి వచ్చారు..
ఫిలిం ఫెస్టివల్‌లో అరుదైన గౌరవం..
ఇటీవల గోవాలో జరిగిన 53వ భారత అంతార్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (IFFI) లో.. మెయిన్ స్ట్రీమింగ్ పిక్చర్ కేటగిరీలో ‘అఖండ’ మూవీని స్క్రీనింగ్ చేశారు. బాలయ్య, బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పాల్గొని రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.. ఈ సందర్భంగా ‘అఖండ’ కు సీక్వెల్ చేస్తామని చెప్పాడు బాలయ్య..
మాస్ జాతర అంటే ఇదేనేమో బాలయ్య
థియేటర్ లో టికెట్ కొనుక్కొని సీట్ లో కూర్చుంటానికే ఇబ్బంది పడుతున్న రోజుల్లో
సీట్ కాదు కదా
నేలమీద కూర్చోబెట్టి కూడా నీ సినిమా చూపిస్తున్నావంటే #జైబాలయ్య #1YearForAKHANDAMassJathara pic.twitter.com/d9aRt5x3kc— Balayya Yuvasena (@BalayyaUvasena) December 1, 2022
AKHANDA MOVIE
(Proud For Sanatan Dharma) ❤️#WeWantAKHANDAInHindi pic.twitter.com/WKmPotT897— धार्मिक इतिहास (@dharmikitihas) January 23, 2022
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..