Manchu Vishnu: ‘మా’ అధ్యక్ష పదవి మంచువారికే.. విష్ణు విజయానికి కారణాలివే!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఆదివారం నాటితో పూర్తయ్యాయి . ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ఆయనకు 400కి పైగా ఓట్లు వచ్చాయి. ఆయన ప్యానెల్ నుంచి పోటీ చేసిన సభ్యులు కూడా ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా జీవితపై రఘుబాబు విజయం సాధించగా.. ట్రెజరర్ గా శివబాలాజీ.. నాగినీడుపై విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌ గా ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు చెందిన శ్రీకాంత్ విజయం సాధించారు.

 

ముందుగా ప్రకాష్ రాజ్ ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించినప్పుడు.. ఆయన గెలవడం పక్కా అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మంచు విష్ణు పేరు వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. రెండు ప్యానెల్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఊహించని రీతిలో మంచు విష్ణు టీమ్ ఎక్కువ స్థానాలను దక్కించుకొని.. సత్తా చాటింది. ఈ గెలుపుకి దోహదపడిన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం!

1.సినీ పెద్దలు, సీనియర్స్ మద్దతుని కూడగట్టడంతో మంచు విష్ణు సక్సెస్ అయ్యారు. తన ప్యానెల్ ప్రకటించిన రోజు నుంచి ఇండస్ట్రీ పెద్దలను కలుసుకుంటూ వచ్చారు.

2. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో ఇప్పటివరకు యంగ్ హీరోలెవరూ కూడా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించలేదు. యంగ్ బ్లడ్ కి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందనే పాయింట్ కూడా విష్ణుకి కలిసొచ్చింది.

3.’మా’ ఎన్నికల్లో ప్రధానంగా వినిపించిన మరో పాయింట్ ‘లోకల్-నాన్ లోకల్’ ఇష్యూ. విష్ణు తెలుగువాడు కావడం, హైదరాబాద్ లో ఉంటాడనే విషయం మరో ప్లస్ పాయింట్ అయింది.

4.విష్ణుని ముందుండి నడిపించడంతో మంచు మోహన్ బాబు కీలకపాత్ర పోషించారు. సినీ పెద్దలను కనెక్ట్ చేయడంతో పాటు.. ‘మా’ సభ్యులకు ఫోన్ చేసి మరీ మాట్లాడారు.

5.’మా’లోని పేద కళాకారుల కోసం విష్ణు అవకాశాలు, విద్య, చదువును, ఆరోగ్యాన్ని అందించే పథకాలను అమలు చేస్తానని ప్రకటించడం.

6.పోస్టల్ బ్యాలెట్ ఓట్లను రాబట్టుకోవడంలో విష్ణు ప్యానెల్ సభ్యులు ఓ అడుగు ముందుకేసి దాదాపు 50 ఓట్లను తమకు అనుకూలంగా సంపాదించుకున్నారు.

 

7.పోస్టల్ ఓటర్లతోపాటు.. ఏపీ, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న సభ్యులను సైతం సంప్రదించి పోలింగ్ రోజున హైదరాబాద్‌కు రప్పించుకోలిగారు మంచు విష్ణు. ఓటర్ల కోసం స్పెషల్ గా ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశారు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు దగ్గరుండి చూసుకున్నారు.

8.నాగబాబు ప్రకాష్ రాజ్ ని సపోర్ట్ చేసే క్రమంలో చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలు, నోరుజారి చేసిన కామెంట్స్ కూడా విష్ణుకి కలిసొచ్చాయనే చెప్పాలి.

9. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మంచు విష్ణు ప్రెస్ మీట్‌ లో ఎక్కువగా ప్రకాష్ రాజ్, నాగబాబులపై విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఒకవేళ వారిని విమర్శిస్తే మీడియా ఆ వ్యాఖ్యలకే ప్రాధాన్యమిచ్చి.. అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తుందని భావించిన విష్ణు ఆచితూచి మాట్లాడారు. నాగబాబుకి కౌంటర్ ఎటాక్ ఇచ్చేప్పుడు కూడా విష్ణు వినమ్రతతో ప్రవర్తించారు.

 

10.ఆదివారం జరిగిన ఎన్నికల్లో కూడా మంచు విష్ణు అండ్ ప్యానెల్.. ఓటేయడానికి వచ్చిన సభ్యులను అప్యాయంగా పలకరిస్తూ.. తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు.

 

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus