స్టార్స్ తో మల్టీస్టారర్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా వాళ్ళ అభిమానులను సంతృప్తి పరిచేలా సన్నివేశాలు ఉండాలి. ఇందులో ఏదైనా లోపం తలెత్తింది అంటే… ఫలితం సంగతి తర్వాత ముందు నవ్వుల పాలవ్వడం గ్యారంటీ. ఒకప్పటి దర్శకుడు శరత్ (Sarath) ఈ రేంజ్ సాహసం చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు కృష్ణులతో ఓ బడా మల్టీస్టారర్ మూవీ చేశారు. అదే ‘సుల్తాన్’ (Sultan) . బాలకృష్ణతో ‘పెద్దన్నయ్య’ (Peddannayya) ‘వంశానికొక్కడు’ (Vamsanikokkadu) వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన ఆయన ‘సుల్తాన్’ అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు, అది కూడా సూపర్ స్టార్ కృష్ణ (Krishna) , రెబల్ స్టార్ కృష్ణం రాజు (Krishnam Raju) వంటి బడా హీరోలతో చేస్తున్న మల్టీస్టారర్..
అంటే అప్పట్లో అది ‘బాహుబలి’ (Baahubali) రేంజ్ అటెంప్ట్ కాకపోతే మరేంటి. అందుకే పీ.బి.ఆర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ అధినేత ఎం.ఆర్.వి.ప్రసాద్ (M. R. V. Prasad) ముందుకు వచ్చారు. అంతే కాదు ఈ సినిమాకి కథ కూడా అందించింది ఆయనే కావడం మరో విశేషం. నేటితో 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ‘సుల్తాన్’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి :
1) 1999 సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘సమరసింహారెడ్డి’ (Samarasimha Reddy) ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఆ వెంటనే ‘సుల్తాన్’ వంటి భారీ బడ్జెట్ ప్రాజెక్టుకి ఆయన సైన్ చేశారు. హైప్ కూడా భారీగా పెరిగింది.
2) కృష్ణ, కృష్ణంరాజు ఆ టైంలో కూడా వేరే సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. వాళ్ళ డేట్స్ కి తగ్గట్టు ‘సుల్తాన్’ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు.
3) ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ‘బాలగోపాలుడు’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని బాలకృష్ణకి అందించిన ఎం.ఆర్.వి ప్రసాద్.. ‘సుల్తాన్’ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.
4) దర్శకుడు శరత్.. ముందుగా ‘సుల్తాన్’ కోసం అనుకున్న కథ ఒకటి. కానీ ఎప్పుడైతే కృష్ణ, కృష్ణంరాజు వంటి బడా స్టార్లు ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారో అప్పుడు పరుచూరి బ్రదర్స్ ఎంట్రీ ఇచ్చి పలు మార్పులు చేశారు.
5) సూపర్ స్టార్ కృష్ణ ఈ చిత్రంలో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేశారు. మరోవైపు సిబిఐ ఆఫీసర్ గా రెబల్ స్టార్ కృష్ణంరాజు చేశారు. కృష్ణంరాజు ఈ సినిమాలో నటించడానికి ముఖ్య కారణం కృష్ణ. వారి మధ్య స్నేహం అలాంటిది.
6) ‘సుల్తాన్’ సినిమా మొదలుపెట్టడమే.. కృష్ణ- కృష్ణంరాజు- బాలకృష్ణ కాంబో సీన్స్ తో మొదలయ్యింది. ఎందుకంటే మిగిలిన వాళ్ళ కాల్షీట్లు ఇబ్బంది పడకుండా ముందుగా అలా చేశారు.
7 ) ఈ సినిమాలో బాలకృష్ణ డబుల్ రోల్ చేయడం జరిగింది. విలన్ రోల్ కూడా ఆయనదే. విలన్ రోల్ కోసం ఆయన ఈ సినిమాలో 11 రకాల గెటప్ లు వేయడం జరిగింది.
8) సుల్తాన్ షూటింగ్.. అండమాన్ దీవుల్లో జరిగింది. బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు.. ఆ స్పాట్ కి ఫ్యామిలీస్ తో కలిసి వెళ్లారట. అక్కడే ఓ సాంగ్ కూడా తీశారు వీరి కాంబినేషన్లో..! అది బాగా వచ్చింది.
9) రాజీవ్ గాంధీ గెస్ట్ హౌస్ లో టీం బస చేసింది. అయితే అక్కడ … తినడానికి తిండి సరిగ్గా దొరికేది కాదట.
10) దీంతో చిత్ర బృందం బియ్యం కూరగాయలు తెప్పిస్తే…. విజయనిర్మల, శ్యామల దేవి టీం అందరికీ వండి పెట్టేవారట. షూటింగ్ స్పాట్లో ఫిషింగ్ చేసి .. ఆ చేపలను విజయనిర్మల గారికి ఇస్తే.. పులుసు పెట్టి అందరికీ పెట్టేవారట. అది చాలా రుచిగా ఉండేదని కూడా టీం చెప్పుకొచ్చింది.
11) మొత్తానికి కిందా మీదా పడి.. షూటింగ్ కంప్లీట్ చేశారు. వేసవి సెలవులు కలిసొస్తాయని 1999 మే 27న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. కానీ మొదటి షోతోనే ప్లాప్ టాక్ వచ్చింది. బాలకృష్ణ నటన బాగున్నప్పటికీ నెగిటివ్ రోల్లో ఫ్యాన్స్ ఆయన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు.
12) కోటి అందించిన సాంగ్స్, వాటి చిత్రీకరణ..అన్నీ టాప్ నాచ్ అనే విధంగా ఉంటాయి. ఈ సినిమాకి బాలయ్య కూడా కొంత డబ్బు పెట్టి సమర్పకులుగా వ్యవహరించడం జరిగింది.
13 ) ‘సుల్తాన్’ కోసం 2 క్లైమాక్స్..లు షూట్ చేశారు. ఒక క్లైమాక్స్ లో కృష్ణ పాత్ర కూడా చనిపోతుంది. కానీ ఆ క్లైమాక్స్ పెడితే కృష్ణ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు అని భావించి మేకర్స్ దాన్ని పక్కన పెట్టడం జరిగింది. అయితే ఈ సినిమాలో కృష్ణంరాజు పాత్ర మాత్రం చనిపోతుంది. అది కూడా ఆయన ఫ్యాన్స్ కి రుచించలేదు.
14) మరోపక్క ‘సమరసింహారెడ్డి’ (Veera Simha Reddy) వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పోల్చి.. అభిమానులు ఈ సినిమాని ఆదరించలేదు. దీంతో ఈ పెద్ద బడ్జెట్ సినిమా ఓ మంచి ప్రయత్నంగా మిగిలిపోయింది తప్ప.. మంచి విజయాన్ని అందుకోలేకపోయింది.