ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వార్ 2’. ఆగస్టు 14న రానున్న ఈ సినిమా గురించి గత కొన్ని నెలలుగా రకరకాల పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. సినిమా గురించి ఎన్ని పాజిటివ్ రూమర్స్ వచ్చాయో, నెగిటివ్ రూమర్స్ కూడా అన్నే వచ్చాయి. వీటిలో వేటికీ చిత్రబృందం స్పందించకపోవడంతో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం ఫ్యాన్స్‌కి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘వార్ 2’ సినిమా గురించి గత కొన్ని నెలలుగా వస్తున్న పుకార్లు, నెగిటివ్ ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు నాగవంశీ. సినిమాలో ఎన్టీఆర్ పరిచయ సన్నివేశం హైలైట్‌గా నిలుస్తుందని క్లారిటీ ఇచ్చేశారు. తారక్- హృతిక్ మధ్య వచ్చే ఆ ఫైటింగ్ సీన్‌కి థియేటర్లలో రెస్పాన్స్ అదిరిపోతుంది అని చెప్పాడు. ఇద్దరు స్టార్ హీరోలు హోరాహోరీగా తలపడితే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అంతేకాదు ఆ ఒక్క సీన్ చూసే తాను ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నానని కూడా చెప్పారు.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువే అని వస్తున్న కామెంట్ల గురించి కూడా నాగవంశీ స్పందించారు. ‘వార్ 2’ సినిమా అంతా ఇద్దరు హీరోలు కనిపిస్తారని చెప్పారు. ఎన్టీఆర్ కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే స్క్రీన్‌పై కనిపిస్తారనేది రూమర్ మాత్రమే అని తేల్చేశారు. సినిమాలో ఇద్దరికీ సమానమైన నిడివి ఉంది అని నాగవంశీ చెప్పారు. బాలీవుడ్ సినిమాలో ఇది సాధ్యమేనా? ఇద్దరు హీరోలను ఒకే నిడివితో చూపిస్తారా అనేది ఆగస్టు 14కి కానీ తేలదు. చూద్దాం నాగవంశీ నమ్మకం ఏమవుతుందో?
ఇక నాగవంశీ – తారక్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనుంది. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ని ఎవరూ ఊహించని స్థాయిలో భారీగా చూపిస్తామని నాగవంశీ చెప్పారు. ‘రామాయణ’ని మించేలా ఈ సినిమాను అనౌన్స్ చేస్తామి చెప్పారు.