OTT Releases: ‘సీతా రామం’ తో పాటు ఈ వీకెండ్ కు రిలీజ్ అవుతున్న ఓటీటీ సినిమాల లిస్ట్..!

ఈ వీకెండ్ కు థియేటర్లలో 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో క్రేజ్ ఉన్న సినిమాలు 3 కాగా, రెండు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ ద్విభాషా చిత్రం అయినప్పటికీ తెలుగు ఫ్లేవర్ ఉన్న సినిమా అని చెప్పాలి. ‘కెప్టెన్’ ‘బ్రహ్మాస్త్ర’ వంటివి పరభాషా సినిమాలు. అయితే కచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే.. ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల పై జనాల్లో పెద్దగా ఆసక్తి లేదు.

కాబట్టి సెప్టెంబర్ మొదటి వారంలానే ఈ వారం కూడా ఓటీటీలదే హవా అని చెప్పాలి. అయితే ఈ వీకెండ్ కు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 సినిమాలు/వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. అందులో ‘సీతా రామం’ వంటి క్రేజీ మూవీ ఉండటం గమనార్హం. ఆ మూవీతో పాటు ఈ వీకెండ్ కు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు/వెబ్ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) సీతా రామం : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీ థియేటర్లలో సూపర్ హిట్ అయ్యింది. సెప్టెంబర్ 9 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

2) మహ : హన్సిక ప్రధాన పాత్రలో, శింబు కీలక పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 9 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

3) 7 డేస్ 6 నైట్స్ : యం.యస్.రాజు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 9 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

4) భీమ్లా నాయక్ : పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం తమిళ వెర్షన్ సెప్టెంబర్ 9 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

5) ఎలీన్‌(Aline) : ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్‌ 9 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

6) డ్యాన్స్‌ ఐకాన్‌ : ఈ డాన్స్ రియాల్టీ షో సెప్టెంబర్‌ 11 నుండి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

7) యునికి యారీ : ఈ బాలీవుడ్‌ మూవీ/సిరీస్ సెప్టెంబర్‌ 9 నుండి ఎం.ఎక్స్.ప్లేయర్ లో స్ట్రీమింగ్ కానుంది.

8) వీరూమాన్ : కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ తమిళ్ మూవీ సెప్టెంబర్ 11 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

9) ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌ : ఈ బాలీవుడ్‌ మూవీ సెప్టెంబర్‌ 9 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

10) మోర్టల్‌ కాంబ్యాట్‌ : ఈ హాలీవుడ్ మూవీ సెప్టెంబర్ 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) తల్లుమాల : ఈ మలయాళం మూవీ సెప్టెంబర్ 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

12) రిక్ అండ్ మార్టీ : ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus