మహేష్ బాబు (Mahesh Babu), దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) కలయికలో రూపొందిన మొదటి సినిమా ‘అతడు’ (Athadu). 2005 ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. పెద్దగా చప్పుడు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఇక్కడ డీసెంట్ సక్సెస్ అందుకుంది. కానీ ‘పోకిరి’ (Pokiri) రేంజ్ హిట్టు సినిమా కాదు. దాని బాక్సాఫీస్ రిజల్ట్ తో పోలిస్తే.. ‘అతడు’ చిన్నగా కనిపిస్తుందేమో కానీ.. దీనికి ఉన్న కల్ట్ ఫ్యాన్స్ దానికి లేరని చెప్పినా తప్పు లేదు అనిపిస్తుంది.
థియేటర్లలో ఈ సినిమా హిట్టే. కానీ సైలెంట్ హిట్. అయితే టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు ఆడియన్స్ ఎక్కువగా వీక్షించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ‘అతడు’ సినిమాని కదలకుండా చూసేస్తారు. మహేష్ బాబుకి ఓవర్సీస్ మార్కెట్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమా ‘అతడు’ అనడంలో సందేహం లేదు. ‘అతడు’ సినిమాలో హైలెట్స్ గురించి చెప్పమంటే లిస్ట్ చాలా ఉంటుంది.
ఈ సినిమాకి త్రివిక్రమ్ రాసుకున్న స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, మణిశర్మ అందించిన సంగీతం, పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్.. ఇలా చాలా హైలెట్స్ ఉంటాయి. అవి రిపీట్స్ లో ఈ సినిమాని చూసేలా చేస్తుంటాయి. అయితే 10 ఏళ్లకు ఒకసారి.. ఏ సినిమా శాటిలైట్ పార్ట్నర్ అయినా మారుతుంటాడు. కానీ ‘అతడు’ ని స్టార్ మా వారు ఇప్పటికీ వదులుకోవడం లేదు.
‘మా టీవీ’ గా ఉన్నప్పటి నుండి ఇప్పటి ‘స్టార్ మా’ వరకు.. ‘అతడు’ సినిమా అందులోనే ప్రసారం అవుతుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ‘అతడు’ సినిమా ‘స్టార్ మా’ లో ఇప్పటివరకు 1500 సార్లు టెలికాస్ట్ అయ్యిందట. ఒకే రోజు స్టార్ మా, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్ లో.. 3 సార్లు టెలికాస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఓ అరుదైన రికార్డు ‘అతడు’ పేరు పై ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు.