ఎన్టీఆర్ (Jr NTR) – రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్లో రిలీజ్ అయిన సింహాద్రి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ కెరీర్లో 7వ సినిమాగా వచ్చిన ఈ సినిమా.. రిలీజ్ అయ్యి నేటితో 21 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :
‘ఆది’ (Aadi) సినిమా షూటింగ్ దశలో ఉండగానే ‘సింహాద్రి’ (Simhadri) నిర్మాతలు అయిన వి.ఎం.సి(విజయ మారుతీ క్రియేషన్స్) వారు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలని భావించారు. అగ్రిమెంట్ పూర్తయ్యింది. ‘ఆది’ చిత్రీకరణ దశలో ఉండగానే ఆ సినిమా షూటింగ్ మొదలైంది.
ఓ పేరుగాంచిన డైరెక్టర్ కథకి ఓకే చెప్పారు.ఎన్టీఆర్ కి కూడా నచ్చడంతో ఆ సినిమా మొదలుపెట్టారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీగా ఆ కథ ఉంటుంది. సగం పైనే షూటింగ్ కంప్లీట్ అయ్యింది కూడా.!
అయితే తర్వాత ‘ఆది’ సినిమా రిలీజ్ అయ్యింది. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అంతే కాదు ఎన్టీఆర్ ఇమేజ్ కూడా మారిపోయింది. అతను మాస్ హీరో అయిపోయాడు. దీంతో దొరస్వామి రాజు (V. Doraswamy Raju) , విజయ్ కుమార్ వర్మ (V. Vijay Kumar Varma)..ల ఆలోచనలో పడ్డారు.
ఎందుకంటే వారు ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి నిర్మిస్తున్న సినిమాలో మాస్ ఎలిమెంట్స్ లేవు. ‘ఆది’ లో ఎన్టీఆర్ కి ఉన్న ఎలివేషన్స్ కూడా తమ సినిమాలో లేవు. ఇవేవీ ప్రశ్నించకుండా,ఆలోచించకుండా ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సగం ఫినిష్ చేసేశాడు.
అయినప్పటికీ ఎన్టీఆర్ ను ఒప్పించి అదనంగా డేట్స్ తీసుకున్నారు. ఎన్టీఆర్ కూడా అందుకు అంగీకరించాడు. అప్పటివరకు చేసిన సినిమాని ఆపేశారు. ఆ డబ్బు పోయినా పర్వాలేదు అనుకున్నారు. అదే టైంలో ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి సూట్ అయ్యే కథ కోసం గాలించడం మొదలుపెట్టారు.
ఆ టైంలో రాజమౌళి సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు.’సింహాద్రి’ లైన్ చెప్పారు. అది నిర్మాతలకి నచ్చింది. అయినప్పటికీ దొరస్వామి రాజు, విజయ్ కుమార్ వర్మ ..లకి రాజమౌళి పై తెలీని డౌట్ ఉంది. ‘ ‘స్టూడెంట్ నెంబర్ 1 ‘ (Student No: 1) వంటి క్లాస్ సినిమా తీసిన రాజమౌళి .. ‘సింహాద్రి’ వంటి మాస్ సబ్జెక్ట్ హ్యాండిల్ చేయగలడా’ అనేది నిర్మాతల డౌట్. అయినప్పటికీ ‘స్టూడెంట్ నెంబర్ 1’ వంటి సక్సెస్ ఇచ్చాడు కదా, పైగా స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) గారి అబ్బాయి కాబట్టి.. మొండి ధైర్యంతో ముందుకు సాగారు. అలా ‘సింహాద్రి’ స్టార్ట్ అయ్యింది.
మరోపక్క రాజమౌళి ఈ కథని ముందుగా బాలకృష్ణకి (Balakrishna) చెబుదామని ప్రయత్నించి ఆగిపోయారు. బాలకృష్ణ నటించిన పలు సూపర్ హిట్ సినిమాలకి విజయేంద్రప్రసాద్ పనిచేశారు. ఆ రిఫరెన్స్ వాడుకుని బాలయ్య వద్దకి వెల్దామనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు.
మరోసారి ప్రభాస్ కి (Prabhas) ఈ కథ గురించి చెప్పారు రాజమౌళి. కానీ అప్పటికి ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా ఎందుకో ప్రభాస్ కి నచ్చలేదట. దీంతో అతను నో చెప్పాడు. ఏదైతేనేం.. ఎన్టీఆర్ దొరికాడు. అతనికి ‘ఆది’ తో మాస్ ఇమేజ్ ఉంది. కాబట్టి రాజమౌళి కూడా హ్యాపీ.
షూటింగ్ సగం కంప్లీట్ అయ్యేసరికే.. బడ్జెట్ శృతి మించింది. మొదట నిర్మాతలు కంగారు పడినా తర్వాత వారికి కూడా ధైర్యం వచ్చింది.
ఓ ఫైట్లో భాగంగా ఎన్టీఆర్ తలకి గాయం అయ్యింది. అయినా అతను ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా షూటింగ్లో పాల్గొన్నాడు.
తర్వాత బడ్జెట్ పెరిగినా.. అనుకున్న టైంకే షూటింగ్ కంప్లీట్ చేశారు.
2003 జూలై 9 న రిలీజ్ చేశారు. మొదటి 2 రోజులు స్లోగా ఉన్నా. తర్వాత మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.
సినిమాలో సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ కి భీభత్సంగా నచ్చేశాయి. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది ఈ సినిమా.
250 కేంద్రాల్లో 50 రోజులు, 150 కేంద్రాల్లో 100 రోజులు, 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడి రికార్డులు కొట్టింది సింహాద్రి సినిమా.
తర్వాత ఈ సినిమాని విజయ్ కాంత్ తమిళంలో రీమేక్ చేశారు. కానీ అది ఫ్లాప్ అయ్యింది. కన్నడంలో కూడా రీమేక్ చేశారు అక్కడ కూడా ప్లాప్ అయ్యింది.
‘సింహాద్రి’ తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ 3 రెట్లు పెరిగింది.