మహేష్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు వస్తుంది. ఆగస్టు 9 అంటే మహేష్ అభిమానులకు పండుగ రోజు అని చెప్పాలి. వీరి కోసమే రీ రిలీజ్,,ల హడావిడి కూడా మొదలైంది. మహేష్ బాబు కెరీర్లో ఇండస్ట్రీ హిట్ అయినటువంటి ‘పోకిరి’ (Pokiri) చిత్రాన్ని 4K కి డిజిటలైజ్ చేసి రీ రిలీజ్ చేశారు. ఆ తర్వాత చాలా మంది హీరోల పుట్టినరోజులకి ఇదే పద్దతిని ఫాలో అయ్యారు. గతేడాది మహేష్ బాబు పుట్టినరోజుకి ‘బిజినెస్ మెన్’ (Businessman) అనే సినిమాని రీ- రిలీజ్ చేశారు.
ఇక ఈ ఏడాది మహేష్ పుట్టినరోజు నాడు ఏ సినిమా రీ రిలీజ్ చేస్తారా? అని అంతా ఎదురు చూడగా ‘మురారి’ (Murari) (4K) ని రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మహేష్ టీం. వాస్తవానికి ‘మురారి’ ఇప్పుడు మహేష్ బాబుకు ఉన్న ఇమేజ్ కి పూర్తి భిన్నంగా ఉంటుంది. అందులో పెద్దగా మాస్ ఎలిమెంట్స్ ఉండవు. అయినప్పటికీ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ‘మురారి’ ఓ స్పెషల్ మూవీ. మహేష్ ని సంపూర్ణ నటుడిగా ఆవిష్కరించిన సినిమా అది.
దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) .. మహేష్ ని చాలా అందంగా ప్రజెంట్ చేసిన సినిమా కూడా అని చెప్పాలి. ఇందులో ఎమోషనల్ సీన్స్ లో మహేష్ జీవించేశాడు. మణిశర్మ (Mani Sharma) సంగీతంలో రూపొందిన పాటలు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది 3 గంటల సినిమా. రీ రిలీజ్ లో అంత నిడివి కలిగిన సినిమాని చూడాలి అంటే అభిమానులకి కష్టమే. అందుకోసం 18 నిమిషాల పార్ట్ ని ట్రిమ్ చేసి రీ రిలీజ్ చేస్తున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు.