‘జీఏ 2 పిక్చర్స్’ , ‘సుకుమార్ రైటింగ్స్’ నిర్మాణంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ’18 పేజెస్’. బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ‘కార్తికేయ2’ వంటి పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. ‘కుమారి 21ఎఫ్’ వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ కొంత గ్యాప్ తీసుకుని డైరెక్ట్ చేసిన మూవీ కూడా.
డిసెంబర్ 23న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ మూవీకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ జస్ట్ యావరేజ్ గా నమోదయ్యాయి. అయితే 6వ రోజు కూడా ఈ మూవీ పర్వాలేదు అనిపించే విధంగా కలెక్ట్ చేసింది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
3.08 cr
సీడెడ్
0.58 cr
ఉత్తరాంధ్ర
0.67 cr
ఈస్ట్
0.43 cr
వెస్ట్
0.23 cr
గుంటూరు
0.29 cr
కృష్ణా
0.23 cr
నెల్లూరు
0.16 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
5.67 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.57 cr
ఓవర్సీస్
1.15 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
7.39 cr (షేర్)
’18 పేజెస్’ చిత్రానికి రూ.12.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.7.39 కోట్ల షేర్ ను రాబట్టింది.
బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.5.61 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇదే విధంగా రెండో వీకెండ్ వరకు కలెక్ట్ చేస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.