18 pages Movie: ‘కార్తికేయ 2’ ఎంత కష్టం తీసుకొచ్చిందో?

ఓ సినిమా విజయం ఇచ్చే కిక్‌ కంటే.. తెచ్చి పెట్టే భారమే ఎక్కువగా ఉంటుంది అని అంటుంటారు. అంటే.. అది బరువుగా ఉండే భారం కాదు. మరిన్ని విజయాలు సాధించాలనే భారం అన్నమాట. ఇప్పుడు ఇలాంటి భారమే అనుభవిస్తున్నాడు నిఖిల్‌. ‘కార్తికేయ 2’ సినిమాతో ఇటీవల భారీ విజయాన్ని అందుకున్నాడు నిఖిల్‌. దీంతో నిఖిల్‌ నుండి రాబోయే రెండు సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడతాయి. దీంతో ఆ సినిమాల సంగతిని మరోసారి నిఖిల్‌ చెక్‌ చేసుకుంటున్నాడట.

నిఖిల్‌ నుండి త్వరలో రాబోయే సినిమాలు అంటే ‘18 పేజీస్‌’, ‘స్పై’. వీటిలో తొలి సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తయిపోయింది. తర్వాత ప్రచారం కూడా స్టార్ట్‌ చేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఆపేశారు. ఈ లోపు కరోనా పరిస్థితులు రావడంతో.. సినిమా విడుదల ఆగిపోయింది. ఇక ‘స్పై’ సినిమా అయితే పూర్తి కావాల్సి ఉంది. దీంతో వీలైనంత త్వరగా ‘18 పేజీస్‌’ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే సినిమాకు రిపేర్లు జరుగుతున్నాయని సమాచారం.

అవును ‘18 పేజెస్‌’ సినిమా రీషూట్లకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. సుకుమార్ రచనలో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో కొన్ని కీలక మార్పులను దర్శకుడు సూర్యప్రతాప్‌ గురువు సుకుమార్‌ సూచించారట. త్వరలో వాటిని పూర్తి చేసి సినిమాను రిలీజ్‌ చేస్తారని అంటున్నారు. ఆ తర్వాతే సినిమా ప్రచారం షురూ చేయాలని చూస్తున్నారట. అయితే ఇప్పుడు చేస్తున్న మార్పులు మైనరా? మేజరా అనేది తెలియాల్సి ఉంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరోవైపు ‘స్పై’ సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. ఎందుకంటే ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు. గ్యారీ బీహెచ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను తొలుత దసరాకు రిలీజ్‌ చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు వాయిదా పడింది. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో సినిమాను విడుదల చేయనున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus