బాలీవుడ్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ ని పాన్ ఇండియా వైడ్.. గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. నాగార్జున ఉన్నాడు కాబట్టి, రాజమౌళి సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు, కాబట్టి తెలుగులో కూడా ఈ మూవీని అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అందుకోసం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను శనివారం సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా నిర్వహించాలి అని ప్లాన్ చేశారు.ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్.
అయితే సరిగ్గా నాలుగు గంటలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని చెప్పడంతో చిత్ర బృందం షాక్ కు గురైంది. వినాయక చవితి వేడుకలు బందోబస్తు అలాగే గతంలో ‘సాహో’ సినిమా ఈవెంట్ టైంలో జరిగిన రచ్చ వంటి కారణాలు చెప్పి ఈవెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేశారు పోలీసులు. దీని వెనుక కేసీఆర్ కుట్ర ఉందని.. ఇటీవల ఎన్టీఆర్- అమిత్ షా ల మీటింగ్ కారణంగానే ఈ ఈవెంట్ కు అనుమతులు నిరాకరించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇవన్నీ అలా ఉంచితే.. ఈ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఏకంగా రూ.2.25 కోట్లు నష్టం వాటిల్లినట్టు ప్రచారం జరుగుతుంది. ఒక ఈవెంట్ క్యాన్సిల్ అయితే నిజంగా అంత నష్టం ఉంటుందా? అనే అనుమానాలు అందరిలోనూ కలిగాయి. నిజానికి ఓ పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎక్కువగా అయితే రూ.75 లక్షల నుండి రూ.1 కోటి వరకు ఖర్చు అవుతుంది. బాలీవుడ్ నుండి చిత్ర బృందం మరియు అక్కడి మీడియాని తీసుకు రావాలి కాబట్టి అందుకు ఇంకో రూ.50 లక్షలు అదనంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మొత్తంగా రూ.1.25 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.ఈ నుమ్బెర్ చాలా ఎక్కువ. ఇదంతా ఈవెంట్ లెక్కలో వేసెయ్యలేము.ఎప్పుడైతే ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందో అమౌంట్ వెనక్కి ఇచ్చే వెసులుబాటు కూడా ఉంది.అయితే తెలిసీ తెలియకుండా ఇష్టమొచ్చిన నెంబర్లు చెప్పేసి ఈ టాపిక్ ను కొంతమంది వైరల్ చేస్తున్నారు తప్ప, విషయం అంత వరకు లేదు అని ఇన్సైడ్ టాక్.
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర