‘నారప్ప’ కోసం సురేష్ బాబు కొత్త స్కెచ్..!

విక్టరీ వెంకటేష్ గతేడాది రెండు హిట్లందుకుని మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక ఈ ఏడాది తమిళంలో బ్లాక్ బస్టర్ కొట్టిన ‘అసురన్’ రీమేక్ లో నటిస్తున్నాడు. ‘నారప్ప’ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. తమిళంలో ‘అసురన్’ ను నిర్మించిన కలైపులి.ఎస్.థాను తో కలిసి సురేష్ బాబు ఈ రీమేక్ ను నిర్మిస్తున్నారు. అయితే ఎప్పుడూ క్లాస్ అండ్ ఫ్యామిలీ సినిమాలు తెరకెక్కించే శ్రీకాంత్ అడ్డాల ఈ మాస్ ఎంటర్టైనర్ కు డైరెక్టర్ ఏంటి.. అంటూ ఎన్నో కామెంట్స్ వినిపించాయి. బోలెడన్ని మీమ్స్ కూడా వచ్చాయి. దీని వెనుక సురేష్ బాబు స్కెచ్ వేరే ఉందనేది తాజా సమాచారం.

ఈ చిత్రానికి సంబందించిన యాక్షన్ సీన్స్ ను… వేరే డైరెక్టర్ తో తెరకెక్కిస్తారట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. ‘వెంకీమామ’ తెరకెక్కించిన కె.ఎస్.రవీంద్ర(బాబీ). యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించడంలో బాబీ సిద్ధహస్తుడు.. ఎలాగూ సురేష్ బాబుతో మంచి రేపో కూడా ఉన్న నేపథ్యంలో.. ఇలా ‘నారప్ప’ కు వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మిగిలిన సన్నివేశాలనన్నిటినీ శ్రీకాంత్ అడ్డాలనే డైరెక్ట్ చేస్తాడట. ఏదేమైనా తెలుగులో ఇద్దరు దర్శకులు ఒకే చిత్రానికి పనిచేయబోతుండడం ఇదే మొదటిసారని చెప్పాలి. ఇక ‘నారప్ప’ షూటింగ్ ను ఇటీవల అనంతపూర్ లో మొదలుపెట్టారు.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus