‘సంక్రాంతికి 4 బ్లాక్ బస్టర్లను అయినా తట్టుకునే స్టామినా బాక్సాఫీస్ కు ఉందని.. ప్రేక్షకులు కూడా సంక్రాంతికి 4 సినిమాలు వస్తే బాగుణ్ణు అంటూ కోరుకుంటారని’.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ గతేడాది ‘వినయ విధేయ రామ’ సినిమా టైంలో చెప్పాడు. ఆ చిత్రం ఫలితం ఎలా ఉన్నా చరణ్ చెప్పింది మాత్రం కరెక్టే అని ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ మరియు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు నిరూపించాయి. చెప్పాలంటే ‘అల వైకుంఠపురములో’ చిత్రమే సంక్రాంతి విన్నర్ గా నిలిచింది..కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కూడా 200 కోట్ల పైనే గ్రాస్ ను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి పాన్ ఇండియా చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.
సాధారణంగా రాజమౌళి సినిమాలు విడుదలవుతున్నాయి అంటే.. దరిదాపుల్లో మరో సినిమాని విడుదల చెయ్యడానికి చాలా భయపడుతుంటారు. కానీ ఇద్దరు మాత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విడుదల సమయంలోనే తమ సినిమాల్ని కూడా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో ఒకరు నాగార్జున… ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ ని నిర్మించబోతున్నాడు నాగ్. ఈ చిత్రాన్ని 2021 జనవరి 15న విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట. మరొకరు దిల్ రాజు. గతేడాది సంక్రాంతికి ‘ఎఫ్2’ తో అలాగే ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత దిల్ రాజు.. ‘ఎఫ్3’ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2021 జనవరి 14న విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట. సంక్రాంతికి ఎలాగూ ఫ్యామిలీ మరియు కామెడీ సినిమాలు చూస్తారు కాబట్టి.. వీరిద్దరూ ఇలా డేర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. విషయం ఏమిటంటే ఈ రెండు చిత్రాల షూటింగ్ లు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జూలైలో మొదలుపెట్టి డిసెంబర్ కు ఫినిష్ చేసి జనవరిలో రిలీజ్ చేసేయాలని ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.