2021లో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ 10 సినిమాల లిస్ట్..!

2020 లో కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల దాదాపు 9 నెలల పాటు థియేటర్లు మూత పడ్డాయి. ఎట్టకేలకు గతేడాది డిసెంబర్ లో తెరుచుకున్నాయి లెండి. జనవరిలో సంక్రాంతి కానుకగా పలు సినిమాలు విడుదలవ్వడం అవి మంచి మంచి ఫలితాల్ని అందించడంతో తిరిగి టాలీవుడ్ కోలుకుంది. ఫిబ్రవరి, మార్చిలో కూడా బ్లాక్ బస్టర్లు పడ్డాయి. ఇండియాలో మరే సినీ ఇండస్ట్రీ కూడా ఇంత త్వరగా కోలుకోలేదు. బహుశా అందుకే దిష్టి తగిలిసిందేమో ఏప్రిల్ ఎండ్ లో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో మళ్ళీ థియేటర్లు మూతపడ్డాయి. తిరిగి జూలై ఎండింగ్ లో తెరుచుకున్నాయి. మరీ జనవరిలో అంత ఫాస్ట్ గా కాకపోయినా సెకండ్ వేవ్ తర్వాత స్లోగా పికప్ అయ్యింది టాలీవుడ్.డిసెంబర్ లో మూడు పెద్ద సినిమాలు విడుదలవ్వడం విశేషం.

ఇదిలా ఉండగా… ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో కలెక్షన్ల పరంగా రికార్డులు కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ పాండమిక్ లో మొదటిరోజు ఎవ్వరూ ఊహించని విధంగా అత్యథిక కలెక్షన్లు రాబట్టిన కొన్ని సినిమాలు ఉన్నాయి. అవేంటో.. చివరికి వాటి ఫలితాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) పుష్ప :

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూడో చిత్రం డిసెంబర్ 17న విడుదలైంది. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ఏకంగా రూ.36.72 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే చివరికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే లేవు.

2) వకీల్ సాబ్ :

పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ అయిన ‘వకీల్ సాబ్’ చిత్రం మొదటి రోజు కేవలం తెలుగు వెర్షన్ తోనే వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.36.46 కోట్ల షేర్ ను రాబట్టి రికార్డులు సృష్టించింది. అయితే సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా థియేటర్లు మూతపడడంతో ఫైనల్ గా ఈ చిత్రం అబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

3) అఖండ :

బాలయ్య- బోయపాటి ల హ్యాట్రిక్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 18.04 కోట్ల షేర్ ను రాబట్టింది.ఆల్రెడీ సూపర్ హిట్ లిస్ట్ లో చేరిన ఈ చిత్రం 25 రోజులు పూర్తవుతున్నప్పటికీ మంచి కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతుంది. 2021 లో విడుదలైన పెద్ద సినిమాల్లో సూపర్ హిట్ గా నిలిచిన మూవీ ఇదొక్కటే అని చెప్పాలి.

4) ఉప్పెన :

వైష్ణవ్ తేజ్- కృతిశెట్టి జంటగా నటించిన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.10.42 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్లకి పైగా షేర్ ను రాబట్టి.. ఆ నెలకి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

5) లవ్ స్టోరీ :

నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.9.31 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫుల్ రన్లో సూపర్ హిట్ గా నిలిచి.. పెద్ద సినిమాలకి హోప్ ఇచ్చింది.

6) క్రాక్ :

రవితేజ- గోపీచంద్ మలినేని ల హ్యాట్రిక్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.7.29 కోట్ల షేర్ ను రాబట్టి.. ఈ ఏడాదికి శుభారంభాన్ని ఇచ్చింది.మొదటి రోజు సెకండ్ షో మాత్రమే పడినప్పటికీ ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి.ఫుల్ రన్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా రవితేజ కెరీర్లో హైయెస్ట్ కల్లెక్షన్లని రాబట్టిన చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది.

7) శ్యామ్ సింగ రాయ్ :

నాని హీరోగా రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.6.91 కోట్ల షేర్ ను రాబట్టింది. ఆంధ్రలో ఎన్నో అడ్డంకుల నడుమ విడుదలైన ఈ చిత్రం ఈ రేంజ్ కలెక్షన్లని సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.

8) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ :

New Poster Out From Most Eligible Bachelor Movie1

అఖిల్- బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 6.58 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫుల్ రన్లో కూడా ఈ చిత్రం కమర్షియల్ హిట్ గా నిలిచింది.

9) రెడ్ :

Hero Ram's RED Movie pre-release business1

రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.5.85 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫుల్ రన్లో ఈ చిత్రం కమర్షియల్ హిట్ గా నిలిచింది.

10) మాస్టర్ :

విజయ్ హీరోగా లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.5.33 కోట్ల షేర్ ను రాబట్టి రికార్డు సృష్టించింది. ఫుల్ రన్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

11) రంగ్ దే :

నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.5.2 కోట్ల షేర్ ను రాబట్టింది.

Share.