మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ తర్వాత సరైన హిట్టు అందుకోలేకపోయాడు. ‘రావణాసుర’ ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘ఈగల్’ ‘మిస్టర్ బచ్చన్’ … ఇలా అతను చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలో అతని సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇదిలా ఉంటే.. మరోపక్క రవితేజ భారీగా పారితోషికం డిమాండ్ చేస్తున్నాడు. అతను అందుకునే పారితోషికానికి తగ్గ కలెక్షన్స్ కూడా రావడం లేదు అని నిర్మాతలు ఉసూరుమంటున్నారు.
ప్రస్తుతం రవితేజ భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 27న విడుదల కానుంది ఈ సినిమా. ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ మంచి రేటుకి దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ‘మాస్ జాతర’ పనులు ఇంకా పూర్తవకుండానే కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ కొత్త సినిమా ప్రారంభించాడు రవితేజ. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. సో ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ కంప్లీట్ చేసి 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావించింది.
కానీ రవితేజ పారితోషికం దగ్గర ఇంకా సెట్ అవ్వడం లేదట. మరోపక్క బడ్జెట్ లెక్కలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందుకే ‘మాస్ జాతర’ ఫలితాన్ని బట్టి చూద్దామని చెప్పి.. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టినట్టు టాక్ మొదలైంది. మరోపక్క ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కించాలని కూడా రవితేజ ప్లాన్ చేస్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో..!