2022 సంవత్సరంలో కొన్ని సినిమాలు అంచనాలకు మించి రికార్డులు క్రియేట్ చేస్తే మరికొన్ని సినిమాలు మాత్రం స్టార్ హీరోల ఫ్యాన్స్ కు సైతం నచ్చలేదు. మాస్ మహారాజ్ రవితేజకు అటు మాస్ ప్రేక్షకులలో ఇటు క్లాస్ ప్రేక్షకులలో అంచనాలకు మించి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అయితే రవితేజ నటించిన ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు అభిమానులకు సైతం నచ్చలేదు. రవితేజ ఇలాంటి కథలను ఎంచుకున్నారేంటని ఈ సినిమాల ద్వారా ఫ్యాన్స్ కు అభిప్రాయం కలిగింది.
ధమాకా సినిమా రవితేజ అభిమానులకు నచ్చినా ఈ సినిమా తుది ఫలితం తేలాల్సి ఉంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా కూడా ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. యాక్షన్ సీన్లు లేకపోవడం ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ అయింది. సాహో హిందీ ఆడియన్స్ ను మెప్పించగా రాధేశ్యామ్ మూవీ మాత్రం హిందీ ప్రేక్షకులకు సైతం నచ్చలేదు. వరుణ్ తేజ్ గని సినిమా కూడా మెగా ఫ్యాన్స్ ను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు కాలం చెల్లిందని గని మూవీతో మరోసారి ప్రూవ్ అయింది. ఆచార్య సినిమా కూడా మెగా ఫ్యాన్స్ ను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది. బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేస్తుందని ఆచార్య విషయంలో మెగా ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఎక్కువమంది కొరటాల శివను విమర్శించారు. రంగ రంగ వైభవంగా సినిమా కూడా మెగా అభిమానులను ఆకట్టుకోలేదు.
విజయ్ దేవరకొండకు లైగర్, నాగచైతన్యకు థాంక్యూ, గోపీచంద్ కు పక్కా కమర్షియల్, నితిన్ కు మాచర్ల నియోజకవర్గం, రామ్ కు ది వారియర్, నాగార్జునకు ది ఘోస్ట్, మంచు విష్ణుకు జిన్నా, నరేష్ కు ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం సినిమాలు షాకులిచ్చాయి. ఈ హీరోలు 2023లో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.