బోలెడన్ని ఆశలతో, కొత్త కోరికలతో 2023కి వెల్‌కమ్ చెప్పింది తెలుగు చలనచిత్ర పరిశ్రమ.. బ్లాక్ బస్టర్ హిట్స్, కోట్లాది రూపాయల కలెక్షన్లతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడాలని.. పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తెలుగు సినిమా మరింత ఉన్నతంగా ఎదగాలంటూ పరిశ్రమ వర్గాల వారు కోరుకుంటూ.. జనవరిలో తమ సినిమాలు విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. చూస్తుండగానే జనవరి అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది.
సంక్రాంతి అనేది తెలుగు వారి పెద్ద పండగ కాబట్టి మేకర్స్ పెద్ద, చిన్న సినిమాలను అప్పుడే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈసారి కూడా చిరంజీవి, బాలకృష్ణ లాంటి టాలీవుడ్ టాప్ స్టార్స్ బాక్సాఫీస్ బరిలో దిగారు. పనిలో పనిగా కోలీవుడ్ స్టార్స్ విజయ్, అజిత్ ఇద్దరూ తమ డబ్బింగ్ బొమ్మలతో వచ్చారు. తర్వాత రిపబ్లిక్ డేకి బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో వచ్చారు. ఇక ఈ జనవరిలో టాప్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్‌గా నిలిచిన చిత్రాలు, వాటి కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి..
పఠాన్ – రూ. 640 కోట్లు (7 రోజులు)
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడమే కాక.. గతకొద్ది కాలంగా సరైన సినిమాలు లేక డీలా పడ్డ బాలీవుడ్ ఇండస్ట్రీ పరువు కాపాడాడు.. ఫస్ట్ డే నుండే రికార్డ్ రేంజ్ వసూళ్లతో సత్తా చాటుతూ.. ఐదు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ టచ్ చేసింది ‘పఠాన్’.. తొలి వారంలో ఏకంగా రూ.640 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రూ.1000 కోట్ల దిశగా దూసుకెళ్తుంది..
వరిసు – రూ. 290 కోట్లు
దళపతి విజయ్ ‘వారసుడు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తమిళంలో ‘వరిసు’ గా జనవరి 11న, తెలుగులో ‘వారసుడు’ పేరుతో జనవరి 14న రిలీజ్ అయింది. కలెక్షన్స్ సునామీ సృష్టించి బాక్సాఫీస్ బరిలో హిట్ అనిపించుకుంది. రూ. 290 కోట్ల గ్రాస్ వసూలు చేసింది..
వాల్తేరు వీరయ్య – రూ. 230 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన పక్కా మాస్ అండ్ ఎమోషనల్ ఫిలిం ‘వాల్తేరు వీరయ్య’.. రవితేజతో కలిసి ప్రేక్షకాభిమానులను ఆకట్టుకోవడంతో పాటు బూజు పట్టిన బాక్సాఫీస్ దుమ్ము దులిపేశారు చిరు.. రూ. 230 కోట్ల గ్రాస్ రాబట్టి, ఈ ఏడాది టాలీవుడ్ ఫస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది..
తునివు – రూ. 190 కోట్లు
‘తల’ అజిత్ కుమార్, హెచ్.వినోద్ కుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం ‘తునివు’.. సంక్రాంతి కానుకగా జనవరి 11న కోలీవుడ్‌తో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘తెగింపు’ కూడా విడుదలైంది. రూ. 190 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందీ చిత్రం..
వీరసింహా రెడ్డి – రూ. 135 కోట్లు
నటసింహ నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబోలో మైత్రీ మూవీస్ నిర్మించిన ఫ్యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వీరసింహా రెడ్డి’.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. రూ.135 కోట్ల గ్రాస్ రాబట్టి బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది..