మెగా ఫ్యామిలీకి 2023 సంవత్సరం లక్కీ ఇయర్ కానుందా?

2023 సంవత్సరంలో మెగా ఫ్యామిలీ నుంచి విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగడంతో పాటు కలెక్షన్లు కూడా అదే స్థాయిలో వచ్చాయి. ఈ సినిమా సక్సెస్ తో చిరంజీవి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు చరణ్ ఉపాసన దంపతులు కొన్ని వారాల క్రితం తీపికబురు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ శుభవార్త గురించి చిరంజీవి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జులై లేదా ఆగష్టులో ఉపాసన బిడ్డకు జన్మనిస్తుందని మెగాస్టార్ చెప్పుకొచ్చారు.

చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22వ తేదీ కాగా ఆ నెలలోనే చరణ్ ఉపాసన దంపతులు బిడ్డకు జన్మనిస్తే బాగుంటుందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఉపాసన చెప్పిన శుభవార్త వల్ల ప్రస్తుతం తమ కుటుంబంలో వాతావరణం ఆనందకరంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత మేనల్లుడు పుడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు మెగా హీరోలకు 2023 కలిసిరావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది మెగా హీరోలు నటించిన సినిమాలన్నీ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చరణ్ శంకర్ కాంబో మూవీ ఈ ఏడాదే థియేటర్లలో రిలీజ్ కానుండగా చిరంజీవి భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పవన్ నటించిన హరిహర వీరమల్లు మూవీ కూడా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుందని సమాచారం. మెగా ఫ్యామిలీ ఇతర హీరోలు సైతం ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

2023 సంవత్సరంలో మెగా ఫ్యామిలీ హవా కొనసాగుతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మెగా హీరోల రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్ శంకర్ కాంబో మూవీ 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus