కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉందన్న సంగతి తెలిసిందే. అలాంటిది ‘మనం’ లాంటి క్లాసిక్ ను మనకు అందించిన దర్శకుడు విక్రమ్ కుమార్ తో అతను మూవీ చేస్తున్నాడు అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ’24’ కి కూడా అదే విధంగా భారీ హైప్ ఏర్పడింది. అయితే తమిళంలో ఈ చిత్రం విజయం సాధించలేదు.. తెలుగులో మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.2016 వ సంవత్సరం మే 6న ఈ చిత్రం విడుదలైంది. నేటితో ’24’ విడుదలయ్యి 5 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి ఈ చిత్రంలో తెలుగు రాష్ట్రాల్లో..
ఫుల్ రన్ ముగిసేసరికి ఎంత కలెక్ట్ రాబట్టిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
6.40 cr
సీడెడ్
2.30 cr
ఉత్తరాంధ్ర
1.65 cr
ఈస్ట్
1.20 cr
వెస్ట్
0.90 cr
గుంటూరు
1.33 cr
కృష్ణా
1.11 cr
నెల్లూరు
0.52 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
15.40 cr
’24’ చిత్రానికి రూ.14.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.15.40 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లకు రూ.0.6 కోట్ల లాభాలు దక్కాయి.బయ్యర్లు పెట్టింది పెట్టినట్టు వెనక్కి రాబట్టడంతో.. తెలుగులో ఈ చిత్రం హిట్ అనిపించుకుంది.