బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం గడిచిపోయింది. మొదటి వారం ఎలిమినేషన్ లేకుండానే ఆదివారం ఎపిసోడ్ ని ముగించేశాడు కింగ్ నాగార్జున. చివరి వరకూ అభినయశ్రీ ఇంకా ఇనయ రెహ్మాన్ ఇద్దరినీ ఉంచి టెన్షన్ పెట్టాడు. తర్వాత ఇద్దరూ సేఫ్ అని చెప్పేసరికి ఇద్దరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఫస్ట్ వీక్ కాబట్టి సెటిల్ అవ్వడానికి టైమ్ పడుతుందని, రెండోవారం నుంచీ మాత్రం ఖచ్చితంగా ఎలిమినేషన్స్ ఉంటాయని ఆడియన్స్ కి చెప్పాడు. ఇక రెండోవారం నామినేషన్స్ తో హౌస్ హీటెక్కిపోయింది.
ఫస్ట్ వీక్ కొంతమంది మాత్రమే ఓపెన్ నామినేషన్ చేస్తే, రెండోవారం అందరూ ఒకరినొకరు నేరుగా నామినేట్ చేసుకునే పద్దతి పెట్టాడు. కుండలని బావిలో పారేసి మరీ వారితో ఉన్న ప్రాబ్లమ్ చెప్తూ ఇంటి నుంచీ బయటకి పంపించేయడానికి సరైనా రీజన్ చెప్పమన్నాడు బిగ్ బాస్. ఇక్కడే ఈవారం నామినేషన్స్ ఆసక్తికరంగా జరిగాయి. ముఖ్యంగా ఆరోహికి ఇంకా ఆదిరెడ్డికి గట్టిగా పడింది. సిల్లీ రీజన్స్ తో నామినేట్ ఎలా చేస్తారంటూ ఆదిరెడ్డి ఆరోహిని లాక్ చేశాడు. దీంతో ఆరోహి తేరుకుని ఆన్సర్ చెప్పింది.
అయినా కూడా నామినేషన్స్ లో ఈసారి ఇద్దరు రివ్యూవర్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకూ సోషల్ మీడియాలో వినిపిస్తున్న బజ్ ప్రకారం చూస్తే ప్రస్తుతం నామినేషన్స్ లో రేవంత్, ఆదిరెడ్డి, గీతు, ఫైమా, అభినయశ్రీ, షానీ, రాజశేఖర్, రోహిత్ కపుల్, ఉన్నారు. అయితే, బిగ్ బాస్ నామినేషన్స్ లో ఎప్పటిలాగానే ట్విస్ట్ ఇచ్చాడు. మరో ఇద్దరిని కెప్టెన్ ని నామినేట్ చేయమని స్పెషల్ పవర్ ఇచ్చినట్లుగా సమాచారం.
మరి బాలాదిత్య ఎవరిద్దరిని నామినేట్ చేశాడు అనేది చూడాలి. ఇక నామినేషన్స్ లో రాజశేఖర్, ఫైమా , ఆరోహి, ఆదిరెడ్డి, గీతు గట్టిగానే ఆర్గ్యూమెంట్స్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక రేవంత్ కూడా ఫుల్ రెచ్చిపోయినట్లుగా సమాచారం. ఈసారి గీతుని, రేవంత్ ని ఇద్దరినీ హౌస్ మేట్స్ టార్గెట్ చేసి ఎక్కువ ఓట్లు వేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈసారి నామినేషన్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!</strong